Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్
Indian national arrested in US | అమెరికాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని 63 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన కేసులో గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల జై సునీల్ భారతి గోస్వామిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు (Indian national arrested in US).
Indian national arrested in US | త్రినేత్ర.న్యూస్ : అగ్రరాజ్యం అమెరికాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయల భారీ మోసానికి పాల్పడిన కేసులో ఓ భారతీయుడిని (Indian national arrested in US) అధికారులు అరెస్ట్ చేశారు. గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల జై సునీల్‌భారతి గోస్వామి (Jay Sunilbharthi Goswami) న్యూజెర్సీ సిటీ (New Jersey)లో నివసిస్తున్నాడు. అయితే, అతడు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని సుమారు రూ.63 కోట్ల (7.5 మిలియన్ డాలర్లు) మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అటార్నీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుల బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలు హ్యాక్ అయ్యాయని నమ్మించారు. భద్రత పేరుతో వారి ఆస్తులను నగదు, బంగారం లేదా ఇతర గిఫ్ట్ కార్డ్‌ల రూపంలోకి మార్చుకోవాలని ఒత్తిడి చేసేవారు. అలా 59- 87 సంవత్సరాల మధ్య వయసు గల వృద్ధుల నుంచి సుమారు రూ.63 కోట్ల మేర వసూలు చేశారు. ఈ స్కామ్‌లో గోస్వామి న్యూ జెర్సీ ప్రాంతాల్లో వృద్ధుల నుంచి నగదు, బంగారాన్ని సేకరించే 'మనీ మ్యూల్'గా వ్యవహరించినట్లు తేలింది.
దీంతో అతడిని అరెస్ట్ చేసి వైర్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, కుట్రల కింద కేసులు నమోదు చేశారు. ఆగస్టు 17న యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జి మార్క్ పెడెర్సన్ ముందు హాజరుపరిచారు. కొన్ని షరతులతో అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైన మరుసటి రోజే అతడు కెనడా మీదుగా ఖరాత్‌కు పారిపోయేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా అధికారులు వెంటనే కెనడా అధికారులకు సమాచారం అందించారు. అతడిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కెనడా పోలీసులు టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోస్వామిని అదుపులోకి తీసుకుని అమెరికాకు అప్పగించారు. అతడిపై నమోదైన అభియోగాలు రుజువైతే గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Also Read..
గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..
కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్
రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..
- ●Bandla Ganesh | కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్
- ●Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
- ●RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం
- ●Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు

Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..

Bandla Ganesh | కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి

RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్






