Vehicle Insurance | వాహనదారులకు కీలక అలర్ట్.. బీమా లేకుండా టోల్‌ప్లాజా దాటితే ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు
Vehicle Insurance | గడువు ముగిసిన లేదా చెల్లుబాటుకాని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలను గుర్తించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా (Mundka toll plaza) వద్ద ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా టోల్‌ప్లాజా దాటిన క్షణాల్లోనే వాహనదారులకు బీమాకు సంబంధించిన హెచ్చరికలు ఎస్ఎంస్ ద్వారా వెళ్తాయి.
Vehicle Insurance | త్రినేత్ర న్యూస్ : వాహనదారులకు కీలక అలర్ట్.. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల భద్రతను పెంచేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ (third party insurance) గడువు ముగిసిన వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఒక నూతన పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని ద్వారా టోల్ ప్లాజా దాటే సమయంలో వాహనానికి బీమా గడువు ముగిసి ఉంటే లేదా బీమా లేకపోతే వెంటనే యజమానికి మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ (SMS) అలర్ట్ వస్తుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్టును ఢిల్లీ (Delhi)లోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II)లోని ముండ్కా టోల్ ప్లాజా (Mundka toll plaza) వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ట్రయల్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాలకు దీనిని విస్తరించనున్నారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే..?
వాహనం టోల్ ప్లాజా దాటిన వెంటనే ఆ వాహన రిజిస్ట్రేషన్ వివరాలు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నిర్వహించే కేంద్ర ప్రభుత్వ 'వాహన్' (Vahan) డేటాబేస్‌తో ఆటోమేటిక్‌గా అనుసంధానించబడుతుంది. డేటాబేస్ తనిఖీలో వాహనానికి బీమా గడువు ముగిసి ఉన్నా లేదా అసలు బీమా లేకపోయినా రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు కొన్ని నిమిషాల్లోనే ఆటోమేటెడ్ సందేశం వెళ్తుంది. ఈ మెసేజ్‌లో వాహనం నంబర్, టోల్ దాటిన సమయం, బీమా గడువు ముగిసిన తేదీ వంటి వివరాలు ఉంటాయి.
ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం..
వాహన యజమానులు తమ బీమా పాలసీలను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకునేలా ప్రోత్సహించడం, బీమా లేని వాహనాలను సులభంగా గుర్తించడం ఈ కొత్త నిబంధన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అంతేకాదు బీమా లేని వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల బాధితులు నష్టపరిహారం పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం వల్ల బీమా గడువు తేదీని మర్చిపోయిన వాహనదారులకు ఈ ఎస్ఎంఎస్ ద్వారా తక్షణమే గుర్తుండి పాలసీని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రూ.10,000 ఫైన్
మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పబ్లిక్ రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి తప్పనిసరిగా థర్డ్-పార్టీ బీమా ఉండాలి. ప్రమాద బాధితులకు లేదా వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక భద్రత కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా లేకుండా వాహనం నడిపితే జరిమానాలు, కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటిసారి పట్టుబడితే వాహన బేస్ ప్రీమియంకు మూడు రెట్లు లేదా రూ. 5,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదేతప్పు మళ్లీ చేస్తే బేస్ ప్రీమియానికి ఐదు రెట్లు లేదా రూ. 10,000లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
Also Read..
మమ్మల్ని ఆటపట్టిస్తున్నారా.. కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదిపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
సంబంధిత వార్తలు

Delhi | ఢిల్లీలో కుప్పకూలిన భవనం పైకప్పు.. చిన్నారి సహా ఇద్దరు మృతి
నవంబర్ 17, 2026

Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు
నవంబర్ 15, 2026

Delhi Air Pollution | ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి గాలి నాణ్యత.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు
నవంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Gold | పెట్టుబడిదారులకు బంగారం భారీ షాక్.. వారం రోజుల్లోనే 9 శాతం పతనం..
- ●Spurious Liquor | కల్తీ మద్యం కలకలం.. 15 మంది మృతి, 180 మందికి అస్వస్థత
- ●AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య
- ●ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!
- ●Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..

Gold | పెట్టుబడిదారులకు బంగారం భారీ షాక్.. వారం రోజుల్లోనే 9 శాతం పతనం..

Spurious Liquor | కల్తీ మద్యం కలకలం.. 15 మంది మృతి, 180 మందికి అస్వస్థత

AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య

ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!



