Revanth Reddy meets Chhattisgarh CM | సమ్మక్క సాగర్ బ్యారేజీ పూర్తయింది.. ఎన్‌వోసీ ఇవ్వండి
Revanth Reddy meets Chhattisgarh CM | సమ్మక్క సాగర్ బ్యారేజీ (Sammakka Sagar Barrage) నిర్మాణం పూర్తయిందని.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌వోసీ (NOC)ని తొందరగా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ను కోరారు.
- మిగిలిన అనుమతుల ప్రక్రియనూ వేగవంతం చేయండి
- ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Revanth Reddy meets Chhattisgarh CM | త్రినేత్ర న్యూస్: సమ్మక్క సాగర్ బ్యారేజీ (Sammakka Sagar Barrage) నిర్మాణం పూర్తయిందని.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌వోసీ (NOC)ని తొందరగా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ను కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్‌వోసీతో పాటు మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం సీఎం విష్ణుదేవ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.
ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూల స్పందన
ఎల్‌నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు. అయితే రేవంత్ విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్‌వోసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
33 ఎకరాలకు ముంపు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించి ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం, పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతుంది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదు.
అధ్యయనం కోసం రూ.9.883 కోట్ల చెల్లింపు
అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది.
సంబంధిత వార్తలు

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
నవంబర్ 21, 2026

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
నవంబర్ 21, 2026

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ●Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?
- ●TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు





