AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య
AI Generated Photo | ఏఐతో సృష్టించిన ఓ ఫొటో (AI Generated Photo) భార్యాభర్తల మధ్య చిచ్చురగిల్చింది. తన భర్త మరో మహిళతో కలిసి ఉన్న ఫొటో చూసిన భార్య.. అతను పనిచేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి చితకబాదింది.
AI Generated Photo | త్రినేత్ర న్యూస్: ఏఐతో సృష్టించిన ఓ ఫొటో (AI Generated Photo) భార్యాభర్తల మధ్య చిచ్చురగిల్చింది. తన భర్త మరో మహిళతో కలిసి ఉన్న ఫొటో చూసిన భార్య.. అతను పనిచేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో (Etawah) చోటుచేసుకుంది.
ఇటావాకు చెందిన అంకిత్ దివాకర్ (Ankit Diwakar) ఓ ప్రైవేటు హాస్పిటల్‌లోని అల్ట్రాసౌండ్ విభాగంలో (Ultrasound Department) వైద్యుడికి సహాయకుడిగా పనిచేస్తున్నారు. ఆరేండ్ల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా (School Teacher) పనిచేస్తున్న ఓ మహిళతో వివాహమైంది. ఇన్నాళ్లుగా అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల మధ్య ఏఐ ఫొటో చిచ్చుపెట్టింది. మరో మహిళతో కలిసి దిగినట్లుగా ఉన్న ఫొటోను చూసిన ఆమె.. నేరుగా అంకిత్ పనిచేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లింది. అతడు రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో అందరి ముందే అతనిపై దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ప్రభుత్వ దవాఖానాలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ ఫొటో నకిలీదని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా తన భార్య దాడికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు తన ఫోన్ తోటి సిబ్బంది వద్ద ఉండేదని, ఆ సమయంలో ఎవరో ఒకరు మరో మహిళతో తాను కలిసి ఉన్నట్లు ఏఐ (AI) టెక్నాలజీతో ఫేక్ ఫొటోను ఎడిట్ చేసి తన ఫోన్‌లో ఉంచారని ఆరోపించారు. దానిని చూసిన తన భార్య ఆగ్రహంతో ఊగిపోయిందని, అది నకిలీ ఫొటో అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదని చెప్పారు. గత మూడు రోజులుగా తన భార్య, అత్తమామలు వేధిస్తున్నారని, తన బావమరిదికి ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని అంకిత్ ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై భార్య తరఫు వాదన తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- ●Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
- ●Gold And Silver Prices Today | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏడాది కనిష్ట స్థాయిలకు చేరిక..
- ●Eating Noodles | నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి
- ●IT Raids | స్నేహా ఫామ్స్‌పై ఐటీ దాడులు.. హైదరాబాద్, విజయవాడ సహా 16 చోట్ల సోదాలు
- ●GTA 6 | చరిత్ర సృష్టించిన జీటీఏ6.. తొలి రోజే 3.8 బిలియన్ డాలర్ల అమ్మకాలు..

EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్

Gold And Silver Prices Today | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏడాది కనిష్ట స్థాయిలకు చేరిక..

Eating Noodles | నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి






