త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Air Pollution | ఢిల్లీలో ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి గాలి నాణ్య‌త‌.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌జ‌లు

Delhi Air Pollution | దేశ రాజ‌ధాని ఢిల్లీలో గాలి నాణ్య‌త (Delhi Air Pollution) క్షీణించింది. శుక్ర‌వారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 450 దాటింది. అత్య‌ధికంగా ఐటీఓలో (ITO) AQI 455గా నమోదైంది. మొత్తం రాజ‌ధాని న‌గ‌రంలోని 58 ఎయిర్ మానిట‌రింగ్ స్టేష‌న్ల‌లో 21 స్టేష‌న్లు తీవ్ర‌మైన కాలుష్య స్థాయిల‌ను నివేదించాయి.

D

National | Published On Nov 13, 2026, 11.06 am IST

Delhi Air Pollution | ఢిల్లీలో ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి గాలి నాణ్య‌త‌.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌జ‌లు
Advertisement

Delhi Air Pollution | త్రినేత్ర న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో గాలి నాణ్య‌త క్షీణించింది. దీపావ‌ళి త‌ర్వాత‌ వాయు కాలుష్యం (Delhi Air Pollution) తారా స్థాయికి చేరింది. ఇవాళ రాజధాని న‌గ‌రాన్ని కాలుష్యం (Air Pollution) కమ్మేసింది. శుక్ర‌వారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 450 దాటింది. మొత్తం రాజ‌ధాని న‌గ‌రంలోని 58 ఎయిర్ మానిట‌రింగ్ స్టేష‌న్ల‌లో 21 స్టేష‌న్లు తీవ్ర‌మైన కాలుష్య స్థాయిల‌ను నివేదించాయి.

సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (Central Pollution Control Board) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. అత్య‌ధికంగా ఐటీఓలో (ITO) AQI 455గా నమోదైంది. అక్షర్‌ధామ్, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 414గా న‌మోద‌య్యాయి. నగరంలోని ఇతర ప్రాంతాలలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చాందినీ చౌక్‌, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌, పూసా, ఎన్‌ఎస్‌యూటీ జాఫర్‌పూర్‌లో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైనే న‌మోద‌య్యాయి. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద AQI 369గా, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 374గా న‌మోదైంది. అటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లోనూ గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది.

గురువారం మధ్యాహ్నం నాటికి ఢిల్లీలో గాలి నాణ్య‌త సూచిన 350గా న‌మోదైంది. గురువారం రాత్రి నాటికి ఈ సూచీ మరింత పెరిగి 387కి చేరుకుంది. గాలిలో పీఎం2.5 కాలుష్య కణాల సాంద్రత 24 గంటల్లోనే రెండింతలకు పైగా పెరిగి, జాతీయ సురక్షిత ప్రమాణం కంటే నాలుగు రెట్లు అధికంగా నమోదైంది. కాలుష్యానికి తోడు న‌గ‌రాన్ని ద‌ట్ట‌మైన పొగ క‌మ్మేసింది. దీంతో విజిబిలిటీ కొన్ని ప్రాంతాల్లో దారుణంగా ప‌డిపోయింది. ఓవైపు తీవ్ర వాయు కాలుష్యం, మ‌రోవైపు చ‌లికి న‌గ‌ర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 450కి పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.

Also Read..

మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర్వ‌ర్లు డౌన్‌..

కేసు ఉప‌సంహ‌రించుకోనందుకు.. కుటుంబంపై దాడి

వ‌రుస లాభాల‌కు బ్రేకులు. న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Advertisement
Advertisement