త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు

ఢిల్లీలోని ఓ బట్టల షోరూమ్ ట్రయల్ రూమ్‌లో 18 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారమే ఈ ఘాతుకానికి కారణమా? నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలుసా?

J

Crime | Published On Nov 15, 2026, 4.21 pm IST

Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు

సంక్షిప్త సారాంశం

ఢిల్లీ మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ బట్టల షోరూమ్ ట్రయల్ రూమ్‌లో 18 ఏళ్ల షబ్నం దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి షోరూమ్ క్లోజ్ చేసే సమయంలో సిబ్బంది ట్రయల్ రూమ్‌లను చెక్ చేస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పదునైన ఆయుధంతో యువతి గొంతు కోసి నిందితుడు పరారయ్యాడు. ఢిల్లీ విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడు సూరజ్‌ను పోలీసులు టెక్నికల్ ఆధారాలతో అరెస్ట్ చేశారు.

Advertisement
  • ఢిల్లీ షోరూమ్ ట్రయల్ రూమ్‌లో దారుణం
  • క్లోజింగ్ టైమ్‌లో షాకింగ్ సీన్
  • పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు

Woman Murder in Trial Room | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ బట్టల షోరూమ్ ట్రయల్ రూమ్‌లో 18 ఏళ్ల యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని షబ్నమ్‌గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సూరజ్‌ను ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

పశ్చిమ ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న షబ్నమ్.. మోతీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలోని ఓ క్లాతింగ్ షోరూమ్‌లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం షబ్నమ్ షిఫ్ట్ ముగిసే సమయానికి నిందితుడు సూరజ్ షోరూమ్‌కు వచ్చాడు. అక్కడి నుండి ఆమెను షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి.. తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు.

క్లోజింగ్ టైమ్‌లో వెలుగులోకి

రాత్రి సుమారు 9:00 గంటల సమయంలో షోరూమ్ సిబ్బంది షాపును మూసివేసేందుకు సిద్ధమయ్యారు. రోజూ లాగే క్లోజింగ్‌కు ముందు ట్రయల్ రూమ్‌లను తనిఖీ చేస్తుండగా, ఓ రూమ్‌లో షబ్నమ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి మెడపై పదునైన ఆయుధంతో కోసిన గాయాలను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రేమ వ్యవహారమే కారణమా?

పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సూరజ్.. మృతురాలు షబ్నమ్‌కు గతంలో మంచి స్నేహితుడని తేలింది. అయితే, గత కొద్ది నెలలుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరం పెరిగింది. వ్యక్తిగత విభేదాలు, వన్-సైడ్ లవ్ కారణంగానే సూరజ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు

హత్య చేసిన తర్వాత ఢిల్లీ విడిచి పారిపోయేందుకు సూరజ్ ప్రయత్నించాడు. అయితే, టెక్నికల్ సర్వైలెన్స్, మాన్యువల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పోలీసులు నిందితుడి కదలికలను ట్రాక్ చేసి.. అతడు నగరం దాటకముందే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం షోరూమ్‌లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు షోరూమ్‌లోకి ఎప్పుడు వచ్చాడు, హత్య తర్వాత ఏ మార్గంలో తప్పించుకున్నాడు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement