NEET UG 2026 | జూన్ 21న నీట్ యూజీ రీఎగ్జామ్.. ప్రకటించిన ఎన్‌టీఏ
NEET UG 2026 | నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు ఎన్‌టీఏ షెడ్యూల్‌ను (NEET UG 2026 Rescheduled) ఖరారు చేసింది. జూన్ 21న (ఆదివారం) పరీక్షను నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది.
NEET UG 2026 | పశ్నాపత్రం లీకైందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఈనెల 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను (NEET UG 2026) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు ఎన్‌టీఏ షెడ్యూల్‌ను (NEET UG 2026 Rescheduled) ఖరారు చేసింది. జూన్ 21న (ఆదివారం) పరీక్షను నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. రీఎగ్జామ్‌కు సంబంధించి ఎన్‌టీఏకు చెందిన అధికార సమాచార ఛానల్స్‌ను మాత్రమే విశ్వసించాలని విద్యార్థులకు సూచించింది.
కాగా, రీఎగ్జామ్‌కోసం అభ్యర్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదనపు పరీక్షా రుసుము కూడా చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. పాత రిజిస్ట్రేషన్ డేటా, పరీక్షా కేంద్రాలనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును కూడా విద్యార్థులకు రీఫండ్ చేయనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
పేపర్ లీక్..
పరీక్షకు ముందు రాజస్థాన్ (Rajasthan)లో పంపిణీ చేసిన మెటీరియల్‌తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు (నీట్ పరీక్షలోని మొత్తం 720 మార్కులకు గాను) పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నల్లో సుమారు 140 ప్రశ్నలు.. పరీక్షకు ముందే లభ్యమైన ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్‌లోని ప్రశ్నలతో పోలిఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ గెస్ పేపర్ పరీక్షకు రెండు రోజుల ముందే అంటే మే1వ తేదీనే రాజస్థాన్‌లోని సికార్‌లో అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఈ ప్రశ్నపత్రాన్ని రూ.20 వేల నుంచి రూ.2లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతేకాదు పరీక్షకు ముందు పంపిణీ అయిన మెటీరియల్‌లో ఉన్న ప్రశ్నలే కాకుండా.. వాటిలోని సమాధానాల ఆప్షన్ల వరుస క్రమం కూడా అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా, లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఇప్పుడు రీఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది.
Also Read..
ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం.. ఐటీఆర్-1, ఐటీఆర్-4 యుటిలిటీస్ విడుదల..
స్టాక్ మార్కెట్లలో ర్యాలీ.. రూపాయి విలువ మళ్లీ పతనం..
కావేరీ ట్రావెల్స్‌లో మంటలు.. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సు
తాజావార్తలు
- ●Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్
- ●Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు
- ●Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు
- ●Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!
- ●ITR Filing | రూ.4 లక్షల లోపు ఆదాయమా? అయినా ఈ 5 పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు తప్పనిసరి!
- ●Telugu OTT | ఓటీటీలోకి నివేదా పేతురాజ్ రీఎంట్రీ తెలుగు మూవీ - నో డైలాగ్స్ - సినిమా మొత్తం పాటలే!

Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్

Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు

Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు

Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!






