ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం.. ఐటీఆర్-1, ఐటీఆర్-4 యుటిలిటీస్ విడుదల..
ITR Filing 2026 | 2025-26 ఆర్థిక సంవత్సరానికి, అంటే అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్‌లకు సంబంధించిన ఎక్సెల్ యుటిలిటీస్‌ను విడుదల చేసింది. ఈ డౌన్‌లోడబుల్ యుటిలిటీస్ ప్రస్తుతం శాఖ అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.
ITR Filing 2026 | 2025-26 ఆర్థిక సంవత్సరానికి, అంటే అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్‌లకు సంబంధించిన ఎక్సెల్ యుటిలిటీస్‌ను విడుదల చేసింది. ఈ డౌన్‌లోడబుల్ యుటిలిటీస్ ప్రస్తుతం శాఖ అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించింది. ఏవై 2026-27 కోసం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఎక్సెల్ యుటిలిటీ, ఆన్‌లైన్ ఫైలింగ్ సౌకర్యం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చిందని వెల్లడించింది. ఎక్సెల్ ఆధారిత యుటిలిటీస్ విడుదల కావడంతో పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ఫామ్‌లు పూర్తి చేసి, జేసన్ ఫైల్ రూపొందించి, దాన్ని ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి వెరిఫికేషన్ అనంతరం సమర్పించవచ్చు.
రూ.50 లక్షల లోపు ఆదాయం ఉంటే..
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేదా ఐటీఆర్ అనేది పన్ను చెల్లింపుదారుడి ఆదాయం, డిడక్షన్స్, చెల్లించాల్సిన పన్ను వంటి వివరాలను అధికారికంగా ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే ప్రక్రియ. సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై 31లోపు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం ఏడు రకాల ఐటీఆర్ ఫామ్‌లు అందుబాటులో ఉండగా, పన్ను చెల్లింపుదారుడి ఆదాయం, వర్గీకరణ ఆధారంగా సరైన ఫామ్‌ను ఎంపిక చేయాలి. మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న రెసిడెంట్ వ్యక్తులు, నాట్ ఆర్డినరిలీ రెసిడెంట్స్ కాకుండా, ఐటీఆర్-1 లేదా సహజ్ ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో జీతం, పెన్షన్, రెండు నివాస గృహాల ఆదాయం, వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయం, పరిమిత వ్యవసాయ ఆదాయం వంటి అంశాలు కవర్ అవుతాయి. అలాగే సెక్షన్ 112ఏ కింద రూ.1.25 లక్షల వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ప్రకటించే వ్యక్తులు కూడా ఈ ఫామ్ ఉపయోగించవచ్చు.
ఐటీఆర్-4 ఎవరికి..?
ఐటీఆర్-4 లేదా సుగమ్ ఫామ్‌ను రెసిడెంట్ వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, ఎల్‌ఎల్‌పీలను మినహాయించి ఇతర సంస్థలు ఉపయోగించవచ్చు. వార్షిక ఆదాయం రూ.50 లక్షల వరకు ఉండాలి. సెక్షన్ 44ఏడీ, 44ఏడీఏ, 44ఏఈ కింద ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ పద్ధతిలో ఫైలింగ్ చేసే వారికి ఇది వర్తిస్తుంది. సెక్షన్ 112ఏ కింద పేర్కొన్న రూ.1.25 లక్షల వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను కూడా ఇందులో చూపించవచ్చు. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం కొత్త ఐటీఆర్ ఫామ్‌లను ప్రకటించింది. ఈసారి పలు రిపోర్టింగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షేర్ బైబ్యాక్‌ల వల్ల కలిగిన నష్టాలు, కొన్ని ట్రేడింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను అదనంగా వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. శాలరీడ్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు ఈసారి ముందుగానే యుటిలిటీస్ అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా మారింది. దీంతో అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, జూలై 31 గడువుకి ముందే సౌకర్యంగా ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేసే అవకాశం లభించనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
- ●Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?






