Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు – చాలా కండీషన్లు పెట్టాడు – అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్లు
ఓ బాలీవుడ్ యంగ్ హీరోపై కృతి సనన్ సంచలన కామెంట్లు చేసింది. మూడేళ్ల క్రితం ఓ హీరోతో సినిమా చేశానని, అతడి తీరు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. హీరో డామినేషన్ నచ్చక ప్రమోషన్స్‌కు దూరమయ్యానని అన్నది. కృతి సనన్ చేసిన కామెంట్లు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ గురించేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Entertainment | Published On Jul 6, 2026, 3.24 pm IST
Kriti Sanon | అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో మూవీ షెహ్‌జాదా పేరుతో హిందీలోకి రీమేక్ అయ్యింది. కార్తీక్ ఆర్యన్ , కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాకు రోహిత్ ధావన్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్‌తో కలిసి హీరో కార్తీక్ ఆర్యన్, భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు.
ఇండస్ట్రీ హిట్...
తెలుగులో అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ త్రీ సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ హిందీలో మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచి ఆడియెన్స్‌ను డిసపాయింట్ చేసింది. కనీసం పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా రాబట్టలేకపోయింది. 2023లో రిలీజైన వరస్ట్ మూవీస్‌లో ఒకటిగా క్రిటిక్స్ షెహ్‌జాదాపై విమర్శలు గుప్పించారు.
విభేదాలపై క్లారిటీ...
షెహ్‌జాదా రిలీజ్ టైమ్‌లో ఈ సినిమా ప్రమోషన్లకు కృతి సనన్ దూరంగా ఉంది. హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఏర్పడిన విభేదాల వల్లే ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రమోషన్స్‌కు అటెండ్ కాలేదని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వివాదంపై మూడేళ్ల తర్వాత రియాక్ట్ అయ్యింది కృతి సనన్.
హీరో డామినేషన్...
హీరో డామినేషన్ వల్లే తాను ప్రమోషన్స్‌కు దూరమవ్వాల్సివచ్చిందని అన్నది. ఈ సినిమా రిజల్ట్‌ను కూడా తాను ముందే ఊహించినట్లు చెప్పింది. "సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు మొత్తం హీరోనే చూసుకున్నాడు. నేను ఈవెంట్లకు వెళ్లాలా? వద్దా? అన్నది అతడే డిసైడ్ చేసేవాడు. ఏం మాట్లాడాలో కూడా చెప్పేవారు. ఎక్కువ మాట్లాడొద్దు, నాకు చెప్పకుండా ఏం చేయద్దు అంటూ కండీషన్లు పెట్టారు. అతడి కంటే నాకే ఎక్కువ పేరు ఎక్కడ వస్తుందోననే ఇన్‌సెక్యూరిటీ ఎప్పుడూ ఆ హీరోలో కనిపించేది. ఆ తీరు నచ్చకే సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నా. డైరెక్టర్ బతిమిలాడటంతో చివరకు అతి కష్టంగా ఓ ఈవెంట్‌కు అటెండ్ అయ్యా. స్టోరీ విషయంలో కూడా హీరో ఇన్‌వాల్వ్ అయ్యాడు. చాలా ఛేంజెస్ చేశారు. వాటివల్లే నిమా ఆడదని మధ్యలోనే అర్థమైంది. కానీ కమిట్‌మెంట్ ఉండటంతో ఇష్టం లేకపోయినా కంప్లీట్ చేశా" అని కృతి సనన్ అన్నది.
కాక్ టెయిల్ 2....
కార్తీక్ ఆర్యన్ పేరు మాత్రం చెప్పలేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి. ఇటీవలే కాక్ టెయిల్ 2తో ప్రేక్షకుల ముందుకొచ్చింది కృతి సనన్. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి సనన్‌తో పాటు మరో హీరోయిన్‌గా రష్మిక నటించింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
జులై 12, 2026

Ramayana Trailer | రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పేశారు – సాయిపల్లవికి మరోసారి అన్యాయం?
జులై 11, 2026

Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు – నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్
జులై 10, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



