త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram | టెలిగ్రామ్ సేవ‌లు పునఃప్రారంభం

Telegram | భార‌త్ (India)లో ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సేవ‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. ఇవాళ ఉద‌యం నుంచి యాప్ మ‌ళ్లీ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

D

National | Published On Jun 23, 2026, 11.27 am IST

Telegram | టెలిగ్రామ్ సేవ‌లు పునఃప్రారంభం
Advertisement

Telegram | భార‌త్ (India)లో ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సేవ‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. జూన్ 21వ తేదీన దేశ‌వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా టెలిగ్రాప్‌పై కేంద్ర ప్ర‌భుత్వం తాత్కాలిక నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. జూన్ 22వ తేదీ వ‌ర‌కూ ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది. కేంద్రం విధించిన ఆంక్ష‌లు నిన్న‌టితో ముగిశాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం నుంచి యాప్ మ‌ళ్లీ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

జూన్ 21వ తేదీన దేశ‌వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ ప్ర‌శాంతంగా ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఎగ్జామ్ నేప‌థ్యంలో పరీక్షా పత్రాల లీకేజీ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవ‌డం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడ‌మే ల‌క్ష్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు టెలిగ్రామ్‌పై కేంద్రం తాత్కాలిక బ్యాన్ విధించింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో స‌వాల్ చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఢిల్లీ హైకోర్టు కేంద్రం నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించింది. జూన్ 22వ ర‌కూ టెలిగ్రామ్‌పై బ్యాన్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement