Stock Markets | స్టాక్ మార్కెట్లలో ర్యాలీ.. రూపాయి విలువ మళ్లీ పతనం..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు వరుస సెషన్లలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అంతకు ముందు మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడగా వరుసగా గురు, శుక్రవారాల్లో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమై అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు (0.42 శాతం) పెరిగి 75,700 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 99 పాయింట్లు (0.36 శాతం) లాభపడి 23,788 వద్ద ఉంది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు వరుస సెషన్లలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అంతకు ముందు మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడగా వరుసగా గురు, శుక్రవారాల్లో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమై అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు (0.42 శాతం) పెరిగి 75,700 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 99 పాయింట్లు (0.36 శాతం) లాభపడి 23,788 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలమైన సంకేతాల కారణంగా మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అమెరికా, యూరోప్, ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అలాగే హెవీ వెయిట్ సెక్టార్లలో పెట్టుబడిదారులు భారీ ఎత్తున కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇది కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమైంది. ముఖ్యంగా లార్జ్ క్యాప్ బ్యాంకులు, ఐటీ, రిలయన్స్ తరహా భారీ పరిశ్రమల స్టాక్‌లు, ఆటో వంటి రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ ఏర్పడింది. చాలా రంగాల్లో పెట్టుబడిదారులు విలువ ఆధారిత స్టాక్స్ కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించేందుకు బాండ్ ఈల్డ్స్‌పై పన్ను మినహాయింపును కేంద్రం ప్రకటిస్తుందని సమాచారం అందుతోంది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పాజిటివ్‌గా ప్రభావితం చేసింది. అయితే పెట్టుబడిదారులు అంతర్జాతీయ పరిణామాల, భౌగోళిక ఉద్రిక్తతల పట్ల కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. అంతర్జాతీయంగా ఏర్పడే నెగెటివ్ పరిణామాలకు వేగంగా స్పందిస్తున్నారు. అందువల్ల కొత్తగా పెట్టుబడి లేదా ట్రేడింగ్ చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్వల్పంగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన రూపాయి విలువ..
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఇంకా స్పష్టత రానందున చమురు ధరలు కాస్త పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.38 శాతం పెరిగి బ్యారెల్‌కు 107 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.57 శాతం పెరిగి బ్యారెల్‌కు 98 డాలర్ల వద్ద ఉంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం కూడా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు తగ్గిన రూపాయి 95.90 వద్ద ఆల్ టై గరిష్టానికి చేరువలో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..
జులై 6, 2026

SEBI | సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
జులై 6, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..
జులై 6, 2026
తాజావార్తలు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
- ●Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?



