Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు
Missing Link | భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించి పోయింది. భారీ వర్షాలకు రూ.6,695 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే ‘మిస్సింగ్ లింక్’ (Missing Link) ప్రాజెక్ట్ ప్రారంభమైన కేవలం రెండు నెలలకే మూతపడింది.
Missing Link | త్రినేత్ర.న్యూస్ : భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించి పోయింది. భారీ వర్షాలకు ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే ‘మిస్సింగ్ లింక్’ (Missing Link) ప్రాజెక్ట్ ప్రారంభమైన కేవలం రెండు నెలలకే మూతపడింది. సహ్యాద్రి కొండల గుండా వెళ్లే ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై 13 కిలోమీటర్ల పొడవైన బైపాస్ మార్గం ఇది. ఖండాలా ఘాట్ సెక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు.
ఈ మిస్సింగ్ లింక్ ద్వారా ముంబై-పూణె మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాలు తగ్గుతుంది. దాదాపు రూ.6,695 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఈ ఏడాది మే 1వ తేదీనే ప్రారంభించారు. ఇటీవలే మిస్సింగ్ లింక్ రోడ్డుపై గుంతలు పడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారీ వర్షాలకు ప్రారంభించిన రెండు నెలలకే ఇది మూతపడటంపై నిర్మాణ నాణ్యతను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
తొలి వర్షానికే అభివృద్ధి కాస్తా మిస్సైంది..
మొదటి వర్షానికే ఇన్ఫ్రా మ్యాన్ కాస్తా డిజాస్టర్ మ్యాన్‌గా (Infra Man has become Disaster Man) మారిపోయారు..! గుంతలు పడటాన్ని ఫస్ట్ రెయిన్ టెస్ట్‌గా అభివర్ణించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మిస్సింగ్ లింక్ ప్రాజెక్టుపై కొండచరియలు విరిగిపడటాన్ని మాన్సూన్ ట్రయల్ అంటారా..? ప్రపంచవ్యాప్తంగా కొండలను తొలిచి సొరంగాలను నిర్మిస్తున్నారు. కానీ మహారాష్ట్రలో మాత్రం తొలి వర్షానికే ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. నిజానికి ఇక్కడ సమస్య వర్షం కాదు. నాసిరకం పనులు, అవినీతి, కాంట్రాక్టర్లకు అందుతున్న రాజకీయ అండదండలే అసలు కారణం. ఈ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ ప్రారంభమైన తర్వాత కురిసిన మొదటి వర్షానికే ఆ అభివృద్ధి కాస్తా మిస్సైపోయింది అంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ విమర్శించారు.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..
ముందస్తు వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో విఫలమైందని కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ విమర్శించారు. మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం గతంలో ఎంతగానో తాపత్రయపడ్డారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు నెలకొన్న ఈ పరిస్థితి కూడా వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇదొక పర్సంటేజ్ ప్రభుత్వం అని శాసనమండలిలో ప్రతిపక్షనేత విజయ్ వడెట్టివార్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం వల్ల ఏ పనీ సరిగ్గా పూర్తి కావడం లేదని వ్యాఖ్యానించారు. సరైన ప్రణాళికతో కాకుండా.. కేవలం బలవంతంగా పనులు లాగించేస్తున్నారని ఆరోపించారు.
#WATCH | Maharashtra: A major landslide occurred on the Missing Link section of the Mumbai–Pune Expressway near the Khandala Exit. Consequently, the Mumbai-bound lane has been completely closed.
According to preliminary information, no casualties have been reported. Efforts are… pic.twitter.com/pRUSGhHabx
— ANI (@ANI) July 6, 2026
Also Read..
ఢిల్లీలో టెస్లా తొలి ఇన్‌మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!
రూ.4 లక్షల లోపు ఆదాయమా? అయినా ఈ 5 పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు తప్పనిసరి!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!
జులై 9, 2026

Heavy Rain | దేశవ్యాప్తంగా ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట మునిగిన ఢిల్లీ.. కశ్మీర్, కేరళ అతలాకుతలం
జులై 9, 2026

Heavy rain | ముంబైలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు… ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత.. రైలు సర్వీసులు రద్దు
జులై 6, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



