Telugu OTT | ఓటీటీలోకి నివేదా పేతురాజ్ రీఎంట్రీ తెలుగు మూవీ – నో డైలాగ్స్ – సినిమా మొత్తం పాటలే!
94 ఏళ్ల వయసులో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం డిఫరెంట్ అంటెప్ట్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Telugu OTT | కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన తెలుగు మూవీ సింగ్ గీతం ఓ విభిన్నమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సీనియర్ డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండెపూడి కీలక పాత్రల్లో కనిపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్...
మాటలు లేకుండా కేవలం పాటలతోనే 94 ఏళ్ల వయసులో ప్రయోగాత్మకంగా సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కించారు. నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్ కావడం, కమల్‌హాసన్, చిరంజీవితో పాటు పలువురు అగ్ర నటీనటులు ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో సింగ్ గీతంపై తెలుగు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ ఏర్పడింది.
22 కోట్ల బడ్జెట్...
డిఫరెంట్ అటెంప్ట్‌గా పేరొచ్చిన థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టడంలో సింగ్ గీతం విఫలమైంది. 22 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆరు కోట్ల లోపే కలెక్షన్స్ దక్కించుకుంది. ఓటీటీ హక్కులు పధ్నాలుగు కోట్లకు అమ్ముడుపోవడం, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్‌తో నిర్మాతలు లాభపడ్డారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
కాగా సింగ్ గీతం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.
కుబేరపురం కథ...
బతుకుతెరువు కోసం ఓ నేరం చేసిన ప్రతాప్ (అయాన్) భోపాల్ సెంట్రల్ జైలు నుంచి రిలీజవుతాడు. అనాథ అనుకున్న ప్రతాప్‌కు తన తండ్రి కుబేరపురంలోని గోల్డ్‌మైన్‌కు ఓనర్ అనే నిజం తెలుస్తుంది. ఆ మైన్స్‌లోని గోల్డ్‌ను వెలికితీసి బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ప్రతాప్‌తో పాటు రేణు (శాలిని) తండ్రికి కూడా గోల్డ్‌మైన్స్‌లో వాటా ఉంటుంది. ప్రతాప్ వాటా కొట్టేసి ఆ గోల్డ్ మైన్‌ను విదేశీ వ్యక్తికి అమ్మేయాలని ప్రయత్నిస్తుంటుంది. పచ్చదనంతో నిండిపోయిన ఆ ఊరు బంగారం మైన్స్ కారణంగా ఏడారిలా మారిపోతుంది. ఊరు మొత్తానికి ఒక్కటే ఒక్క చెట్టు మిగిలిపోతుంది.ఆ చెట్టును గౌరి (అహిల్య) కాపాడుకోవాలని అనుకుంటుంది. అనుకోకుండా ఆ ఊరికి కుబేరుడు ఓ శాపం పెడతాడు. అదేమిటి? ఊరివాళ్లంతా మాటలను కూడా పాటల్లా పాడటానికి కారణం ఏమిటి? గౌరి పరిచయం ప్రతాప్‌లో మార్పు తీసుకొచ్చిందా? కుబేరుడి సాయంతో ఆ ఊరిని గౌరి ఎలా కాపాడింది? ఓ గోల్డ్ మైన్స్ కథేంటి? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
- ●Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
- ●Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..
- ●Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?
- ●Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!
- ●Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా

Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..

Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?






