Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్
Jagadish Reddy | కన్నేపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లు ప్రారంభం చేసి 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లు పారించొచ్చని చెప్పారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. మంత్రి ఉత్తమ్ చెప్తున్నట్లు ఏ ప్రమాదం జరిగినా దానికి బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు.
- ఉత్తమ్ చెప్పినట్టు ప్రమాదమే జరిగితే బీఆర్ఎస్‌ను రద్దు చేస్తం.. ఇక రాజకీయాల వైపు చూడం
- 150 టీఎంసీల నీళ్లు నిల్వ చేయొచ్చు.. అయినా ప్రభుత్వం పట్టించుకుంటలే
- కాళేశ్వరంలో 10 రూపాయల అవినీతి కూడా బయటకు తీయలేకపోయారు
- కాంగ్రెస్‌పై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
Jagadish Reddy | త్రినేత్ర.న్యూస్: కన్నేపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లు ప్రారంభం చేసి 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లు పారించొచ్చని చెప్పారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు చేతగాకుంటే వారం రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగిస్తే రాష్ట్రమంతా నీళ్లు పారించి చూపెడతామని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ చెప్తున్నట్లు ఏ ప్రమాదం జరిగినా దానికి బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే బీఆర్ఎస్‌ను రద్దు చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉత్తమ్‌కు ఏం తెల్వదు..
ప్రభుత్వ కుట్ర, మోసాన్ని తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. మంత్రి ఉత్తమ్ అడిగినా, కేబినెట్ అడిగినా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ అండర్ టేకింగ్ ఇస్తారు. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం మాత్రమే. ఎన్డీఎస్ఏకు ఏ మాత్రం సంబంధం లేదు. అలా అయితే ఎస్ఎల్‌బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాలి. ఏడాది నుంచి కనీసం మోటార్లను ప్రారంభం చేయలేదని ఇంజినీర్లు చెప్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కు ఏమీ తెలియదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అని ఎద్దేవా చేశారు.

మంత్రులది సొల్లు పురాణమే..
శ్రీధర్ బాబు లాంటి వాళ్లు కూడా పదవీ భయంతో రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తుతున్నారు. మంత్రులు తెలంగాణ ఆత్మను కోల్పోయారు. తెలంగాణ భూములను కాపాడేందుకు కన్నేపల్లి సిద్ధంగా ఉందని కేటీఆర్ అందరికీ కళ్లకు కట్టినట్లు చూపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశించాం. స్పందించిన నలుగురు మంత్రులు మళ్లీ సొల్లు పురాణం తప్ప తెలంగాణ సోయితో మాట్లాడలేదు. లక్ష కాదు పది రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయారు. ప్రభుత్వం వేసిన కమిషన్‌ను కోర్టు చెత్త బుట్టలో పడేసింది అని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం కట్టిన ఉద్దేశమదే..
ఎల్‌నినో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఉద్దేశం ఇదే. ఎటువంటి కరువు నచ్చినా ప్రజలను బతికించడానికి ప్రాణహిత ఉపయోగపడుతుంది. బ్యారేజీల నుంచి ఇసుక తవ్వి వేల కోట్లు దండుకుంటున్నారు. విద్యుత్ బిల్లులకు భయపడి, రైతుల పంట కొనాల్సి వస్తుందని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం పంపులు నడపడం లేదు. ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటారు అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
- ●Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?





