NEET Exam | వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష.. ప్రకటించిన కేంద్ర మంత్రి
NEET Exam | వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను (NEET Exam) పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా పరీక్షల్లో అవకతవకల పట్ల ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
NEET Exam | నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణల (NEET Paper Leak) నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను (NEET Exam) పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) శుక్రవారం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
ఈనెల 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు ధృవీకరించడంతోనే ఆ పరీక్షను రద్దు చేసినట్లు తెలిపారు. రీఎగ్జామినేషన్ జూన్ 21న నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులను జూన్ 14 నాటికి జారీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. "నీట్ యూజీ 2026 పరీక్ష మే3న జరిగింది. అయితే మే 7న గెస్ పేపర్ గురించి ఆందోళనలను వ్యక్తమయ్యాయి. కొన్ని రోజుల్లోనే పేపర్ లీకైనట్లు అధికారులు ధృవీకరించారు. పేపర్ లీకైనట్లు మాకు ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే.. విచారణకు ఆదేశాలు జారీచేశాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ పరీక్షను రద్దు చేశాం. పేపర్ ఎలా లీకైంది.. ఎవరు లీక్ చేశారన్న దానిపై విచారణ జరుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటాం" అని ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
వ్యవస్థను పటిష్టం చేయాలి..
అదేవిధంగా పరీక్షల్లో అవకతవకల పట్ల ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పరీక్షా విధానాన్ని దెబ్బతీయాలని చూసే ఎవరైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి తప్పలూ జరగకుండా పరీక్షలు నిర్వహించేందుకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇక నీట్ రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇందుకోసం వారం రోజులు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేసినప్పటికీ, పరీక్షా నిర్వహణ క్రమంలో లోపం జరిగిందని ఆయన అంగీకరించారు. వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Also Read..
జూన్ 21న నీట్ యూజీ రీఎగ్జామ్.. ప్రకటించిన ఎన్‌టీఏ
ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి.. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ విమర్శలు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
- ●Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
- ●Vinod Kumar | ఇక్కడ.. అక్కడ.. రెండు ఓట్ల సంగతి ఎప్పుడు తేలుస్తరు?

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో

Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా






