Fuel Prices Hike | ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి.. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ విమర్శలు
Fuel Prices Hike | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్రవ్యోల్బణ వ్యక్తి అని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికల తర్వాత మోదీ వసూళ్ల పర్వం మొదలైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంధన ధరలు పెంచి ప్రజలపై మళ్లీ ఆర్థిక భారాన్ని మెపారని మండిపడ్డారు.
Fuel Prices Hike | ముందుగా ఊహించినట్లే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి (Fuel Prices Hike). పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.3 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు మోదీ (PM Modi) ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.
ద్రవ్యోల్బణ వ్యక్తి మోదీ అంటూ కాంగ్రెస్ (Congress) విమర్శించింది. ఈ మేరకు ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను పోలీస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ఎన్నికల తర్వాత మోదీ వసూళ్ల పర్వం మొదలైందంటూ ఘాటుగా విమర్శించింది. "మోదీ.. ద్రవ్యోల్బణ వీరుడు. పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 చొప్పున పెంచి ప్రజలపై మళ్లీ ఆర్థిక భారం మోపారు. ఇదే సమయంలో సీఎన్‌జీ (CNG) ధరలను కూడా రూ.2 మేర పెంచారు. ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదల్యాయి" అంటూ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ఘాటు విమర్శలు చేసింది.
ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుంది..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh ) విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో ఈ ధరల పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని, ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని కాంగ్రెస్ గతంలో పదేపదే కోరిందని గుర్తు చేశారు. కానీ అప్పట్లో దేశీయంగా ఇంధన ధరలను తగ్గించకుండా వినియోగదారులను దోచుకున్నారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని కాంగ్రెస్ కోరుతూనే ఉంది. అలాగే దేశీయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది. అయితే, అది జరగలేదు. ఇంకా వినియోగదారులు దోపిడీకి గురయ్యారు. ఇప్పుడు, ప్రధాన మంత్రికి మంచి మిత్రులైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు పశ్చిమాసియాలో మొదలుపెట్టిన యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇంతకుముందు వాణిజ్య ఎల్‌పీజీ ధరలను పెంచినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచింది. దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ముందుగా అంచనా వేసినట్లుగా ద్రవ్యోల్బణం దాదాపు 6 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధి అంచనాలు కూడా గణనీయంగా తగ్గుతాయి" అని జైరాం రమేష్ పేర్కొన్నారు.
Also Read..
స్టాక్ మార్కెట్లలో ర్యాలీ.. రూపాయి విలువ మళ్లీ పతనం..
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా ఓఎంసీల షేర్లు భారీగా పతనం
తాజావార్తలు
- ●Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్
- ●Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు
- ●Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు
- ●Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!
- ●ITR Filing | రూ.4 లక్షల లోపు ఆదాయమా? అయినా ఈ 5 పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు తప్పనిసరి!
- ●Telugu OTT | ఓటీటీలోకి నివేదా పేతురాజ్ రీఎంట్రీ తెలుగు మూవీ - నో డైలాగ్స్ - సినిమా మొత్తం పాటలే!

Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్

Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు

Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు

Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!






