Petrol Diesel Prices | ఈ రాష్ట్రంలో దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ..
Petrol Diesel Prices | దేశంలో దాదాపు నాలుగేండ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) పెరిగాయి. ప్రధాని పొదుపు మంత్రం, చమురు వినియోగాన్ని తగ్గించాలన్న ప్రకటన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచాయి.
Petrol Diesel Prices | త్రినేత్ర.న్యూస్: దేశంలో దాదాపు నాలుగేండ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) పెరిగాయి. ప్రధాని పొదుపు మంత్రం, చమురు వినియోగాన్ని తగ్గించాలన్న ప్రకటన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచాయి. దేశవ్యాప్తంగా ప్రతి లీటర్‌పై సగటున రూ.3 వడ్డించాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటింది. డిజిల్ కూడా రూ.100కి చేరువైంది. ఇక తాజా పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అగ్రస్థానంలో నిలిచింది.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే..
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఏపీలో చమురులు దేశంలోనే అత్యధికంగా ఉంటున్నాయి. అదే పరంపరను ఇప్పటికీ ఆ రాష్ట్రం కొనసాగిస్తున్నది. పల్నాడులో అత్యధికంగా రూ.113.62గా ఉన్నది. అతితక్కువగా అనకాపల్లిలో రూ.111.63గా ఉన్నది. ఇక విజయవాడలో రూ.113.03, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, కృష్ణ, నెల్లూర్, పార్వతీపురం మన్యం, వెస్ట్ గోదావరిలో లీటరు పెట్రోల్ ధర రూ.113 పైనే ఉన్నది.
రూ.100 దాటిన డీజిల్..
ఇక డీజిల్ ధర ఏపీలో రూ.100.71 ఉండగా, అత్యధికంగా పల్నాడులో రూ.101.24గా ఉంది. ఆ తర్వాత నెల్లూరులో రూ.101.11గా ఉంది. అతి తక్కువగా అనకాపల్లిలో రూ.99.36 గాఉంది. విశాఖ (రూ.99.47), ప్రకాశం (రూ.99.66), కోనసీమ (రూ.99.95), కడప (రూ.99.87), అనంతపూర్ (రూ.99.78) లో మాత్రమే రూ.100 లోపు ఉన్నది. మిగిలిన అన్ని పట్టణాల్లో రూ.100 పైగా ఉంది. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పించకపోవడంపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధం ప్రభావం..
కాగా, దేశంలో నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగియి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్ నుంచి ధరలు మారలేదు. 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై కూడా వడ్డించింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో, డీజిల్ ధరలు ఇలా..
- ఢిల్లీ- పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67
- ముంబై- పెట్రోల్ రూ.106.54, డీజిల్ రూ.93.03
- హైదరాబాద్- పెట్రోల్ రూ.110.50, డీజిల్ రూ.98.70
- కోల్‌కతా- పెట్రోల్ రూ.108.45, డీజిల్ రూ.95.02
- చెన్నై- పెట్రోల్ రూ.103.80, డీజిల్ రూ.95.39
- బెంగళూరు- పెట్రోల్ రూ.105.96, డీజిల్ రూ.93.99
- పాట్నా- పెట్రోల్ రూ.108.54, డీజిల్ రూ.94.78
- జైపూర్- పెట్రోల్ రూ.108.03, డీజిల్ రూ.93.49
- తిరువనంతపురం- పెట్రోల్ రూ.110.38, డీజిల్ రూ.99.26
- చండీగఢ్- పెట్రోల్ రూ.97.30, డీజిల్ రూ.85.45
సంబంధిత వార్తలు

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
జులై 6, 2026

Accident | 9 గంటలకు పెండ్లి.. కొబ్బరి పొట్టు లారీ రూపంలో మృత్యువు..
జులై 3, 2026

Pawan Kalyan on social media abuse | సోషల్ మీడియాలో ఇక ఆ ఆటలు సాగవు.. అసభ్య ప్రచారాలపై పవన్ కళ్యాణ్ సీరియస్
జులై 1, 2026
తాజావార్తలు
- ●Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్
- ●Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు
- ●Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు
- ●Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!
- ●ITR Filing | రూ.4 లక్షల లోపు ఆదాయమా? అయినా ఈ 5 పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు తప్పనిసరి!
- ●Telugu OTT | ఓటీటీలోకి నివేదా పేతురాజ్ రీఎంట్రీ తెలుగు మూవీ - నో డైలాగ్స్ - సినిమా మొత్తం పాటలే!

Jagadish Reddy | అక్కడ బటన్ నొక్కితే తెలంగాణ మొత్తం నీళ్లొస్తయ్

Kriti Sanon | హీరో డామినేషన్ నచ్చలేదు - చాలా కండీషన్లు పెట్టాడు - అల వైకుంఠపురములో రీమేక్‌పై కృతి సనన్ కామెంట్లు

Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు

Tesla | ఢిల్లీలో టెస్లా తొలి ఇన్మాల్ ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం..!



