త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మ‌హిళా వ్య‌తిరేక స‌ర్కార్‌

Alka Lamba | బీజేపీ స‌ర్కార్ చందా చోర్ స‌ర్కార్‌.. మ‌హిళా వ్య‌తిరేక స‌ర్కార్‌.. ఓటు చోర్ స‌ర్కార్ అని మహిళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా ఫైర‌య్యారు. అయోధ్య రామ మందిరంలో దొంగతనం జరిగితే ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jul 5, 2026, 12.52 pm IST

Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మ‌హిళా వ్య‌తిరేక స‌ర్కార్‌
Advertisement
  • రామ మందిరంలో చోరీ జ‌రిగితే మోదీ ఎందుకు మాట్లాడ‌లే
  • అక్క‌డున్న‌ది ఆర్ఎస్ఎస్ వాళ్లు కాదా?
  • నారీశ‌క్తి వంద‌న్ బిల్లు త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాలి
  • 25న ఢిల్లీలో భారీ ధ‌ర్నా చేస్తాం
  • మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షురాలు అల్కా లంబా

Alka Lamba | Alka Lamba |త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ స‌ర్కార్ చందా చోర్ స‌ర్కార్‌.. మ‌హిళా వ్య‌తిరేక స‌ర్కార్‌.. ఓటు చోర్ స‌ర్కార్ అని మహిళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా ఫైర‌య్యారు. అయోధ్య రామ మందిరంలో దొంగతనం జరిగితే ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. అక్కడ ఉన్న నేతలు ఆర్ఎస్ఎస్‌ వాళ్లు కాదా అని నిల‌దీశారు. ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా చేయనున్న‌ట్లు తెలిపారు. నారీశక్తి వందన్ 33% రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో మ‌హిళా నాయ‌కుల‌తో క‌లిసి ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

మా పాల‌న చూసి మ‌హిళ‌లు సంతోష‌ప‌డుతున్న‌రు..

3 నెలల నుండి 19 జిల్లాలలో సమావేశాలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారు. మ‌హిళ సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. 1,16 వేలకు పైగా మహిళా నేతల సభ్యత్వాలు నమోద‌య్యాయి. సెప్టెంబర్ నెలలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అని ఆమె తెలిపారు.

ఈనెల 20 నుంచి దేశవ్యాప్త పోరాటం..

నారీశక్తి వందన్ 33% రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలి. మహిళ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించాలి. బీజేపీ ఎమ్మెల్యే, నేతలు చిన్న పిల్లలపై హత్యాచారం చేస్తున్నారు. పేపర్ లీక్ చేసి విద్యార్థుల‌ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విఫలమ‌య్యారు. ఆపరేషన్ సింధూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో అబద్ధాలు ఆడారు. జులై 20 నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటం చేయనున్నాం. తెలంగాణ మహిళ కాంగ్రెస్ కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి పోస్ట్ కార్డ్ ద్వారా ఉద్యమం చేపట్టాం. 91334 00200 మిస్డ్‌కాల్ ఉద్యమం కూడా చేపట్టాం. బీజేపీ ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు అని అల్కా లంబా పేర్కొన్నారు.

Advertisement
Advertisement