త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM family Land Scam | సీఎం కుటుంబం వంద‌ల ఎక‌రాల భూ స్కామ్‌.. సంచ‌ల‌నం రేపుతున్న నివేదిక‌

CM family Land Scam | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) ల్యాండ్ స్కామ్‌లో చిక్కుకున్నారు. గ‌త రెండేళ్ల‌లోనే ఏకంగా 168 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన‌ట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

D

National | Published On Jun 24, 2026, 11.58 am IST

CM family Land Scam | సీఎం కుటుంబం వంద‌ల ఎక‌రాల భూ స్కామ్‌.. సంచ‌ల‌నం రేపుతున్న నివేదిక‌
Advertisement

CM family Land Scam | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) ల్యాండ్ స్కామ్‌లో చిక్కుకున్నారు. సీఎం, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, వారికి సంబంధించిన కంపెనీలు ఉజ్జ‌యిని దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో గ‌త రెండేళ్ల‌లోనే ఏకంగా 168 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన‌ట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

స‌ద‌రు నివేదిక ప్ర‌కారం.. సీఎం మోహన్ యాదవ్ కుటుంబానికి, వారి కంపెనీలకు ఉజ్జయిని పరిసరాల్లో మొత్తం 335 ఎకరాల భూమి ఉంది. ఇందులో 137 ప్లాట్లలో విస్తరించి ఉన్న దాదాపు 168 ఎకరాల భూమిని 2024-25 కాలం మ‌ధ్య కొనుగోలు చేశారు. ఉజ్జయిని జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రోడ్ల పక్కనే ఉన్న ఈ భూమిని రూ.45 కోట్లతో కొనుగోలు చేశారు. మోహన్‌ యాదవ్‌తోపాటూ ఆయన భార్య సీమా యాదవ్, కుమారుడు వైభవ్ యాదవ్, కోడలు శాలిని యాదవ్, సోదరులు నందలాల్, నారాయణ్ యాదవ్ స‌హా మొత్తం 11 మంది బంధువుల పేర్ల‌తో ఈ భూ కొనుగోళ్లు జ‌రిగాయి.

మోహన్ యాదవ్ 2013 నుంచి ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ, సుదీర్ఘకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఆయన 2023 చివరిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం కాక‌ముందే ఆయ‌న కుటుంబానికి 179 ఎక‌రాల విస్తీర్ణంలో 108 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో 85 ఎక‌రాలు 2021-2023 కాలంలో కొనుగోలు చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆస్తుల కొనుగోళ్లు విప‌రీతంగా పెరిగాయి.

ఈ భూముల కొనుగోళ్లు జరిగిన కొద్ది కాలానికే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035ను అధికారికంగా ప్రకటించింది. ఈ మాస్టర్ ప్లాన్ కింద ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, బైపాస్ రోడ్లు , సింహస్థ కుంభమేళా మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ సీఎం కుటుంబం కొనుగోలు చేసిన భూముల పరిసర ప్రాంతాల గుండానే వెళ్తున్నాయి. ఈ మాస్ట‌ర్ ప్లాన్ విడుద‌లైన త‌ర్వాత రూ.45 కోట్లు విలువ చేసే ఆ భూములు ఇప్పుడు వంద‌ల కోట్లు చేర‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో లూటీ ఇంజన్ నడుస్తోందంటూ హ‌స్తం నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం కుటుంబం భూములు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో భూ వినియోగ మార్పిడి (Land-use changes) కి సంబంధించిన అధికారిక జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జుడీషియల్ విచారణ జ‌ర‌పాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Also Read..

33 డిగ్రీల ఎండలోనూ హుడీ ధరించి.. కేతన్ హ‌త్య కేసు నిందితులను పట్టించిన సీసీటీవీ ఫుటేజ్

ముంబైలో భారీ వ‌ర్షం.. ఎండ తీవ్ర‌త నుంచి ఉప‌శ‌మ‌నం

అధిక వేడి.. ఉప‌శ‌మ‌నం కోసం నీటిలో మునిగి 40 మంది మృతి..!

Advertisement
Advertisement