Balloons Burst | బీజేపీ సభలో పేలిన గ్యాస్ బెలూన్లు.. పలువురికి గాయాలు.. షాకింగ్ వీడియో
Balloons Burst | మధ్యప్రదేశ్ ఉజ్జయిని (Ujjain)లో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ( Bharatiya Janata Yuva Morcha) శ్యామ్ టైలర్ (Shyam Tailor)ను సత్కరిస్తుండగా.. అక్కడ ఏర్పాటు చేసిన బెలూన్లు ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయాయి.
Balloons Burst | గ్యాస్ బెలూన్ల వల్ల ఎంత ప్రమాదమో తెలిపే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే మహారాష్ట్ర ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు పేలిపోయిన (Balloons Burst) విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ ఉజ్జయిని (Ujjain)లో చోటు చేసుకుంది. బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ( Bharatiya Janata Yuva Morcha) శ్యామ్ టైలర్ (Shyam Tailor)ను సత్కరించేందుకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఉజ్జయినిలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్టేజ్‌పై శ్యామ్ టైలర్‌ను సత్కరిస్తుండగా.. అక్కడ ఏర్పాటు చేసిన బెలూన్లు ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. హైడ్రోజన్ గ్యాస్ నింపిన బెలూన్లు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది.
కాగా, ఇటీవలే మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న ముంబై (Mumbai)కి సమీపంలో ఉన్నగోరేగావ్ (Goregaon) ప్రాంతంలోని అమోల్ టవర్‌లో ఓ బర్త్‌డే పార్టీ కోసం గ్యాస్ బెలూన్లు ఆర్డర్ ఇచ్చారు. డెలివరీ బాయ్ ఆ బెలూన్లను తీసుకొని వచ్చారు. వాటిని లిఫ్ట్‌లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. లిఫ్ట్ ఎక్కగానే ఆ బెలూన్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఓ మహిళ సహా ముగ్గురు గాయపడ్డారు.
https://x.com/TimesNow/status/2019661040573988918
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



