త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharat Tiwari Encounter | భోజ్‌పూర్‌లో యువకుడి ఎన్‌కౌంటర్‌పై విమ‌ర్శ‌లు.. పోలీసుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

Bharat Tiwari Encounter | బీహార్‌ (Bihar)లోని భోజ్‌పూర్ (Bhojpur) జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో భరత్ భూషణ్ తివారీ అనే (Bharat Tiwari Encounter) యువ‌కుడు మ‌రణించిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో మృతుడి త‌ల్లి ఫిర్యాదు ఆధారంగా షాపూర్ పోలీసు స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. జగదీష్‌పూర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (Jagdishpur SDPO), షాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ సహా ఐదుగురు పోలీసు సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

D

National | Published On Jun 24, 2026, 1.25 pm IST

Bharat Tiwari Encounter | భోజ్‌పూర్‌లో యువకుడి ఎన్‌కౌంటర్‌పై విమ‌ర్శ‌లు.. పోలీసుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు
Advertisement

Bharat Tiwari Encounter | బీహార్‌ (Bihar)లోని భోజ్‌పూర్ (Bhojpur) జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో భరత్ భూషణ్ తివారీ అనే (Bharat Tiwari Encounter) యువ‌కుడు మ‌రణించిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే తివారీని పోలీసులు పథకం ప్రకారమే కాల్చి చంపారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం దీనిని ఆత్మరక్షణ కోసం జరిగిన ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మృతుడి త‌ల్లి ఫిర్యాదు ఆధారంగా షాపూర్ పోలీసు స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. జగదీష్‌పూర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (Jagdishpur SDPO), షాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ సహా ఐదుగురు పోలీసు సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌతీ గ్రామానికి చెందిన తివారీ.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళ‌మెత్తేవాడు. గ్రామంలోని రోడ్ల దుస్థితి, వరద బాధితుల సమస్యలు, స్థానిక అవినీతిపై సోషల్ మీడియా వేదికగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జూన్ 17న స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సిబ్బంది అతడిని చుట్టుముట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో తివారీ మోకాళ్లు, తొడ భాగంలో నాలుగు బుల్లెట్లు దిగాయి. తీవ్ర గాయాల‌తో ఉన్న ఆ యువ‌కుడిని పాట్నా మెడిక‌ల్ కాలేజ్ హాస్పిటల్‌కు త‌ర‌లించారు. అయితే, అక్క‌డ అత‌ను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. పోలీసుల తీరుపై స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పోలీసులు మాత్రం దీనిని ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం జ‌రిపిన ఎన్‌కౌంట‌ర్‌గా చిత్రీక‌రించారు. కానీ, సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్న వీడియో మాత్రం పోలీసుల వాద‌న‌కు విరుద్ధంగా ఉంది. కాల్పులకు ముందే తివారీ తన వద్ద ఉన్న ఆయుధాన్ని దూరంగా పారేసినట్లు స్పష్టమైంది. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉద్దేశ‌పూర్వ‌కంగానే తివారీని కాల్చి చంపిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన బిహార్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొవ‌చ్చి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి న్యాయ విచారణ (Judicial inquiry)కు ఆదేశించింది. అలాగే, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో సహా నలుగురు పోలీస్ సిబ్బందిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

ఇక ఈ ఘ‌ట‌న‌పై మృతుడి త‌ల్లి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సోమవారం షాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు ఎస్పీ (SP) కార్యాలయం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో అప్పటి జగదీష్‌పూర్ ఎస్‌డీపీఓ (SDPO), అప్పటి షాపూర్ ఎస్‌హెచ్‌ఓ (SHO) లతో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇతర పోలీసు సిబ్బంది పేర్లను చేర్చినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

ఇది హ‌త్యే..

ఇక ఈ ఘ‌ట‌న‌పై న్యాయ‌వాది వ‌ర్షా సింగ్ మాట్లాడుతూ.. భార‌తీయ చ‌ట్టం ప్ర‌కారం ఎన్‌కౌంట‌ర్ ప్ర‌క్రియ‌కు ఎలాంటి చ‌ట్ట‌ప‌ర‌మైన గుర్తింపూ లేదు. త‌మ ప్రాణాల‌కు ముప్పు ఉన్న‌ప్పుడు లేదా తీవ్ర‌మైన నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి వేరే మార్గం లేన‌ప్పుడు మాత్ర‌మే పోలీసులు తుపాకుల‌కు ప‌నిచెప్పాలి. అయితే, తివారీ విష‌యంలో అలా జ‌రిగిన‌ట్లు క‌నిపించ‌లేదు. ఈ ఘ‌ట‌న హత్యతో సమానం. ఎన్‌కౌంటర్ వల్ల ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. త‌ప్ప‌నిస‌రిగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. ఈ ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ జ‌ర‌పాల‌న్న ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాన్ని మేము స్వాగ‌తిస్తున్న‌ప్ప‌టికీ.. అది క్రిమినల్ జవాబుదారీతనాన్ని నిర్ధారించలేదు అని అన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు కోసం ఈకేసును కోర్టు సీబీఐ (CBI)కి అప్ప‌గిస్తుంద‌ని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Also Read..

డైట్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు షురూ..

చికున్‌గున్యాకు గోమూత్రంతో విజ‌య‌వంతంగా చికిత్స‌.. వెల్ల‌డించిన ఐఐటీ రూర్కీ..

గూగుల్ క్రోమ్‌లో భారీ అప్‌డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..

Advertisement
Advertisement