Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..
Google Chrome | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్లోని ఆటోఫిల్ ఫీచర్‌కు కీలక అప్డేట్ను ప్రకటించింది. ఈ కొత్త మార్పులతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు మరింత అధునాతన ఆటోఫిల్ సదుపాయాలను పొందనున్నారు. అలాగే మొబైల్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లలో గూగుల్ వాలెట్‌తో క్రోమ్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసింది.
Technology | Published On Jun 24, 2026, 12.56 pm IST
Google Chrome | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్లోని ఆటోఫిల్ ఫీచర్‌కు కీలక అప్డేట్ను ప్రకటించింది. ఈ కొత్త మార్పులతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు మరింత అధునాతన ఆటోఫిల్ సదుపాయాలను పొందనున్నారు. అలాగే మొబైల్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లలో గూగుల్ వాలెట్‌తో క్రోమ్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ అప్డేట్ ద్వారా వినియోగదారులు పాస్‌పోర్ట్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం, చెల్లింపు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఆటోఫిల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే క్రోమ్ ఆటోఫిల్ ఫీచర్ విమాన ప్రయాణ చెక్-ఇన్లు, పార్కింగ్ చెల్లింపులు వంటి ఆన్లైన్ పనులను వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతోంది. ఇప్పుడు గూగుల్ దీనిని మరింత విస్తరించి సంక్లిష్టమైన డేటా రకాలకూ మద్దతు అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు విమాన ప్రయాణ వివరాలు, వాహన సమాచారం, లైసెన్స్ ప్లేట్ నంబర్, వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (వీఐఎన్) వంటి సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఫామ్‌లలో నింపుకోవచ్చు.
గోప్యత, భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ..
గూగుల్ వాలెట్‌తో క్రోమ్ అప్డేట్ను కూడా సంస్థ మరింత విస్తరించింది. ఇప్పుడు గూగుల్ వాలెట్లో నిల్వ ఉంచిన సమాచారాన్ని ఉపయోగించి క్రోమ్ ఫామ్‌లను ఆటోమేటిక్‌గా నింపుతుంది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, పాస్‌పోర్ట్ సమాచారం, నోన్ ట్రావెలర్ నంబర్ (కేటీఎన్), చెల్లింపు వివరాలు వంటి సమాచారం ఉంటుంది. ఒకవేళ ఈ వివరాలు ఇప్పటికే గూగుల్ వాలెట్లో సేవ్ చేసి లేకపోతే, వినియోగదారు మొదటిసారి క్రోమ్‌లో వాటిని మాన్యువల్‌గా నమోదు చేసినప్పుడు గూగుల్ వాలెట్లో సేవ్ చేయాలని సూచిస్తుంది. దీంతో భవిష్యత్తులో అదే సమాచారాన్ని మళ్లీ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. గోప్యత, భద్రత విషయంలో కూడా గూగుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపింది. వినియోగదారుల అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని క్రోమ్ సేవ్ చేయదు, ఆటోఫిల్ చేయదు. సున్నితమైన సమాచారం ఎన్క్రిప్షన్ ద్వారా రక్షణలో ఉంటుందని సంస్థ పేర్కొంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై..
వినియోగదారులు గూగుల్ వాలెట్ సెట్టింగ్స్ లేదా క్రోమ్ సెట్టింగ్స్‌లోని ఆటోఫిల్ అండ్ పాస్వర్డ్స్ పేజీ ద్వారా తమ నిల్వ చేసిన సమాచారాన్ని నిర్వహించవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు. డిజిటల్ ఐడీలు వంటి ప్రైవేట్ పాస్‌లను వాటి ప్రత్యేక నియంత్రణల ద్వారా నిర్వహించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త అధునాతన ఆటోఫిల్ ఫీచర్లు ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోని క్రోమ్ వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే అప్డేట్ అయిన గూగుల్ వాలెట్ ఫీచర్ మొబైల్‌తోపాటు డెస్క్‌టాప్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!
అక్టోబర్ 31, 2026

ChatGPT | చాట్ జీపీటీలో కొత్త ఫీచర్.. ఫామ్‌లను అలవోకగా నింపుతుంది..
అక్టోబర్ 17, 2026

Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



