త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు..! డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు..

ACB Raids | మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్ల‌లో అవినీతి నిరోధక శాఖ శుక్ర‌వారం సోదాలు నిర్వ‌హించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన అధికారులు, ఆయనకు సంబంధించిన ఎనిమిది ఇళ్లలో ఒకేసారి తనిఖీలు చేపట్టారు.

P

Telangana | Published On May 22, 2026, 12.44 pm IST

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు..! డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు..
Advertisement

ACB Raids | మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్ల‌లో అవినీతి నిరోధక శాఖ శుక్ర‌వారం సోదాలు నిర్వ‌హించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన అధికారులు, ఆయనకు సంబంధించిన ఎనిమిది ఇళ్లలో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వంశీ మోహన్‌పై ఉన్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్‌, పిగ్లీపురం ప్రాంతాల్లో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసిన‌ట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ఓ రియల్టర్‌కు బదిలీ చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అలాగే, అదే రియల్టర్‌ నుంచి పది ప్లాట్లను గిఫ్ట్‌ డీడ్‌ రూపంలో పొందినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంశీ మోహన్‌కు చెందిన ఆస్తుల విలువ రూ.వందల కోట్ల‌ల్లో ఉండ‌వ‌చ్చ‌ని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నగదు లావాదేవీలు, బినామీ ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై కూడా అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ దర్యాప్తుతో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement