Ketan Agarwal Murder Case | 33 డిగ్రీల ఎండలోనూ హుడీ ధరించి.. కేతన్ హత్య కేసు నిందితులను పట్టించిన సీసీటీవీ ఫుటేజ్
Ketan Agarwal Murder Case | పుణేకు (Pune) చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ అగర్వాల్ (26) మృతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హత్యకు ముందు లోహగడ్ ఫోర్ట్ (Lohagad Fort) వద్ద కేతన్, సియాను హుడీ (Hoodie) ధరించిన ఓ వ్యక్తి ఫాలో అవుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.
Ketan Agarwal Murder Case | పుణేకు (Pune) చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ అగర్వాల్ (26) మృతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హత్యకు ముందు లోహగడ్ ఫోర్ట్ (Lohagad Fort) వద్ద కేతన్, సియాను హుడీ (Hoodie) ధరించిన ఓ వ్యక్తి ఫాలో అవుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. జూన్ నెలలో 33 డిగ్రీల వేడి వాతావరణం ఉన్నప్పటికీ.. అతడు హుడీ ధరించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. హుడీ ధరించిన వ్యక్తి సియా ప్రియుడు, నిందితుడు చేతన్ చౌదరిగా (Chetan Chaudhary) గుర్తించారు.
33 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ హుడీ..
ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఘటనకు సంబంధించిన కొన్ని పరిస్థితులు మాకు అనుమానాస్పదంగా అనించాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టాం. కోట టికెట్ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. కేతన్, సియా కలిసి నడుచుకుంటూ వెళ్తుండటం కనిపించింది. ఆ ఫుటేజ్‌ని డీప్‌గా పరిశీలిస్తే.. ఆ జంటను ఓ ముసుగు వ్యక్తి వెంబడిస్తున్నట్లు తేలింది. ఆ వ్యక్తి తన ముఖం కనిపించకుండా హుడీతో కవర్ చేసి ఉన్నాడు. హుడీపైనే హెడ్‌సెట్ కూడా పెట్టుకోవడం కనిపించింది. మధ్యలో ఓసారి సియా వెనక్కి తిరిగి చూసిందని.. అప్పుడు ముగుసు (హుడీ ధరించిన వ్యక్తి) వ్యక్తి కింద కూర్చోవడం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉంది. ఘటన జరిగిన సమయంలో అక్కడ 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత ఉంది. అంతటి వేడి వాతావరణంలో ఎవరైనా హుడీ ఎందుకు ధరిస్తారనే ప్రశ్న ప్రతీ ఒక్కరికీ వస్తుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనూ ఆ వ్యక్తి ఉన్నాడు. దీంతో అనుమానం వచ్చి.. సియా ప్రియుడు చేతన్ సోషల్ మీడియా యాక్టివిటీని పరిశీలించాం. ఆ హుడీ ధరించిన వ్యక్తిని, చేతన్ చిత్రాలను పోల్చి చూడగా.. ఆ వ్యక్తి చేతనేనని నిర్ధారణ అయ్యింది అని సదరు పోలీసు అధికారి వివరించారు.
లొకేషన్ ట్రేస్ కాకుండా..
జూన్ 18న సియా, కేతన్ లోహగఢ్ కోటకు చేరుకున్నప్పుడు చేతన్ వారితో కలిసి ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. తన లొకేషన్ ట్రేస్ కాకుండా ఉండేందుకు చేతన్ తన ఫోన్‌ను షాప్‌లోనే వదిలేసి దానికి బదులుగా షాప్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఆరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5:40 వరకూ చేతన్ తన మొబైల్ నెట్‌ను కూడా ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిణామాలు పోలీసుల అనుమానాలను మరింత బలం చేకూర్చాయి. ఇక దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన రోజున చేతన్ నంబర్‌కు కాల్స్ చేసిన వారందరినీ పోలీసులు విచారించారు. దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం.. ఆ కాల్స్ మాట్లాడింది చేతన్ కాదని, అతని దుకాణంలో పనిచేసే కార్మికులే చేతన్ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నట్లు తేలింది.
అంతేకాదు, చేతన్-సియా మధ్య అనేక ఫోన్ కాల్స్ నడిచాయి. గంటల కొద్దీ వీరు ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఆ ఫోన్ కాల్స్ రికార్డ్ ఆధారంగా వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నిర్ధరించుకున్న పోలీసులు ఓ ప్లాన్ ప్రకారమే వీరు ఈ హత్య చేసినట్లు ఓ అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. వీరు నేరం అంగీకరించారు.
Also Read..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల నిరాసక్తత..?
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం.. రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ప్రయోజనం
మెటా స్మార్ట్ గ్లాసెస్ వచ్చేశాయి.. అధునాతన ఏఐతో రియల్‌టైమ్‌లో పనిచేస్తాయి..
సంబంధిత వార్తలు

Siya Goyal Pune crime | బర్త్‌డే సర్ప్రైజ్ పేరుతో ఫేక్ ఇన్‌స్టా వల.. పుణె కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో వెలుగులోకి భయానక నిజాలు
సెప్టెంబర్ 20, 2026

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
ఆగస్టు 24, 2026

Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
- ●Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
- ●India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ

Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్



