DIET | డైట్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ అప్లికేషన్లు షురూ..
DIET | పాఠశాల విద్యా శాఖ పరిధిలోని డైట్ (DIET) కాలేజీల్లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
DIET | త్రినేత్ర.న్యూస్: పాఠశాల విద్యా శాఖ పరిధిలోని డైట్ (DIET) కాలేజీల్లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి, అర్హత కలిగినవారు అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 29తో అప్లికేషన్ గడువు ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులకు సీనియర్ లెక్చరర్ రూ.58,850 నుంచి రూ.1,37,050, లెక్చరర్ పోస్టులకు రూ.54,220 నుంచి రూ.1,33,630 జీతం వస్తుంది.
మొత్తం ఖాళీలు: 86
ఇందులో సీనియర్ లెక్చరర్ పోస్టులు 23, లెక్చరర్ (సర్వీస్ ట్రైనింగ్/DRU తదితర విభాగాలు) 16 చొప్పున ఉన్నాయి.
- లెక్చరర్- ఎడ్యుకేషన్-2
- లెక్చరర్-ఎడ్యుకేషన్ (ఉర్దూ మీడియం)- 4
- లెక్చరర్ (ఇంగ్లిష్)- 3
- లెక్చరర్ (తెలుగు)-8
- లెక్చరర్ (ఉర్దూ)- 1
- లెక్చరర్ (మ్యాథ్స్)- 3
- లెక్చరర్ (మ్యాథ్స్), ఉర్దూ మీడియం- 2
- లెక్చరర్ (సైన్స్)- 3
- లెక్చరర్ (సైన్స్) ఉర్దూ మీడియం- 2
- లెక్చరర్ (సోషల్ స్టడీస్)-3
- లెక్చరర్(సోషల్) ఉర్దూ మీడియం- 2
- లెక్చరర్(ఫిలాసఫీ)- 1
- లెక్చరర్ (సైకాలజీ)- 3 పోస్టులు
- లెక్చరర్ (ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్)- 2
- లెక్చరర్ (ఆర్ట్ ఎడ్యుకేషన్)-3
- లెక్చరర్ (ఎడ్యుకేషన్ టెక్నాలజీ)-2
- లెక్చరర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)- 3
అర్హతలు..
సీనియర్ లెక్చరర్ డైట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈడీలలో సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కులు 50 శాతం ఉండాలి.
లెక్చరర్ పోస్టులకు కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీతో పాటు ఎంఈడీ అర్హత అవసరం. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కులు 50 శాతం వచ్చి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ మినహా, మిగిలిన అన్ని లెక్చరర్ పోస్టులకు ఎంఈడీ తప్పనిసరి.
ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీలు పొంది ఉంటే, ఆయా డిగ్రీలకు యూజీసీ, ఏఐసీటీఈ, డీఈబీ గుర్తింపు కచ్చితంగా ఉండాలి. అభ్యర్థుల వయసు 2026, జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు.
- పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 150 మార్కులు. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
- పేపర్ 2లో పార్ట్-ఏ, బీ రెండూ ఉంటాయి. పార్ట్-ఏ లో 75 ప్రశ్నలు 150 మార్కులు, పార్ట్-బీలో 75 ప్రశ్నలు, 150 మార్కులు. ఈ పార్టుల్లో సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్
అప్లికేషన్లు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: ఓసీ, ఓబీసీలకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.500
పరీక్ష ఫీజు: రూ.120. నిరుద్యోగ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 29
పరీక్ష తేదీ: నవంబర్‌లో
వెబ్‌సైట్: https://www.tgpsc.gov.in
తాజావార్తలు
- ●HYDRAA | ఐటీ కారిడార్లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!
- ●Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..
- ●Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్ష్యం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్
- ●Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?
- ●Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేలపై పడేసి కాలితో తొక్కిన కుమారుడు
- ●Bengaluru Metro | నిలిచిన మెట్రో రైళ్లు.. లారీలు, ట్రక్కులు ఎక్కిన టెకీలు

HYDRAA | ఐటీ కారిడార్లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!

Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..

Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్ష్యం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్

Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?




