BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
BRS Party | కర్ణాటక ప్రభుత్వం భీమా, కృష్ణ నదులపై నిర్మిస్తున్న అక్రమ చెక్‌డ్యాంలు, బ్యారేజీలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బృందం ఆదివారం పరిశీలించనుంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, అంజయ్య, రాజేందర్ రెడ్డి, ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు పర్యటనలో పాల్గొంటారని తెలిపారు.
BRS Party | కర్ణాటక ప్రభుత్వం భీమా, కృష్ణ నదులపై నిర్మిస్తున్న అక్రమ చెక్‌డ్యాంలు, బ్యారేజీలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బృందం ఆదివారం పరిశీలించనుంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, అంజయ్య, రాజేందర్ రెడ్డి, ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు పర్యటనలో పాల్గొంటారని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు రావాల్సిన నీటిని అడ్డుకుంటోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అలాగే ఆర్డీఎస్ పరిధిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల తుంగభద్ర జలాలు తెలంగాణ వైపు రాకుండా చేస్తున్నాయని విమర్శించారు.
నీటి కొరత కారణంగా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంటలు ఎండిపోతుండగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కర్ణాటక నుంచి నీటి ప్రవాహం నిలిచిపోతే యాసంగి సీజన్‌లో తెలంగాణ రైతులు పంటలు సాగు చేసే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి నష్టం జరుగుతున్నా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించిన ఆయన, రైతులకు సాగునీరు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పర్యటన అనంతరం వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, తెలంగాణ రైతుల పొలాలకు నీరు అందేలా ఒత్తిడి తీసుకువస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!





