త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జ‌ట్టు ఎంపిక‌..!

Sri Lanka Tour | శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును వచ్చే వారం ప్ర‌క‌టించ‌నుంది. ఇందుకోసం సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశం జ‌రుగ‌నుంది. సమావేశంలో ప్రధానంగా ఫాస్ట్ బౌల‌ర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ అంశంపైనే చర్చ జరిగే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్టుతో తొలి టెస్ట్ ఆడుతుంది.

P

Sports | Published On Jul 25, 2026, 9.30 pm IST

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జ‌ట్టు ఎంపిక‌..!
Advertisement

Sri Lanka Tour | శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును వచ్చే వారం ప్ర‌క‌టించ‌నుంది. ఇందుకోసం సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశం జ‌రుగ‌నుంది. సమావేశంలో ప్రధానంగా ఫాస్ట్ బౌల‌ర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ అంశంపైనే చర్చ జరిగే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్టుతో తొలి టెస్ట్ ఆడుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన బుమ్రా గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. అత‌ని ఫిట్‌నెస్ కీల‌కంగా మారింది.

ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు బుమ్రా ఎడమ మోకాలిలో వాపు కారణంగా దూరమయ్యాడు. కోలుకునేందుకు ఇంకా మూడు వారాల సమయం ఉండటంతో శ్రీలంక టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంక చేరుకోనుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కొలంబోలోని నోండెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్‌లో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే, బుమ్రా కూడా జట్టుతో కలిసి ఆగస్టు మొదటి వారంలోనే శ్రీలంకకు వెళ్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి చేరనున్నాడు. జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ తర్వాత జడేజా టెస్టు జట్టులో కనిపించలేదు. శ్రీలంక పర్యటనలో జ‌డ్డు పాత్ర కీలకంగా మారనుంది.

ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు జడేజాను ఎంపిక చేసిన జ‌ట్టులో చోటు ద‌క్క‌ని విష‌యం తెలిసిందే. ప్రస్తుతం పేస్ విభాగంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్ భారాన్ని కుల్దీప్ యాదవ్, ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ మోయ‌నున్నారు. అఫ్గానిస్థాన్‌పై అరంగేట్ర టెస్టులో మానవ్ సుతార్ ఆకట్టుకున్నాడు. మూడో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ద‌క్కే అవ‌కాశాలున్నాయి. అఫ్గానిస్థాన్‌పై రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మరో ఎడమచేతి స్పిన్నర్ హర్ష్ దూబేను సైతం ప్రత్యామ్నాయంగా జట్టులో కొనసాగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Advertisement
Advertisement