త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే ‘వందేమాతరం’ ప్రదర్శన!

కళ్లు కనిపించవు.. మాట రాదు.. కానీ వారు చేసిన వందేమాతరం నృత్యం అందరినీ కట్టిపడేసింది. 150 మంది దివ్యాంగ చిన్నారులతో 15 ఏళ్ల అక్షర చేయించిన అద్భుతం ఇది!

J

Hyderabad | Published On Jul 25, 2026, 11.55 pm IST

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే ‘వందేమాతరం’ ప్రదర్శన!
Advertisement
  • హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా 150 మంది దివ్యాంగ విద్యార్థులతో 'వందేమాతరం' నృత్య ప్రదర్శన
  • బ్లైండ్, డెఫ్, ఆటిజం సమస్యలున్న పిల్లలకు స్వయంగా కూచిపూడి నృత్యం నేర్పించిన 15 ఏళ్ల అక్షర దేవళ్ల
  • దివ్యాంగులకు జాలి కాదు, అవకాశం ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో ఈ సాహసోపేత ప్రయత్నం
  • గతంలో కార్గిల్ మంచుకొండలపై కూడా వందేమాతరం గీతానికి నృత్యం చేసి సంచలనం సృష్టించిన అక్షర

Vande Mataram 150 | త్రినేత్ర.న్యూస్ : కళ్లు కనిపించని (Blind), మాట రాని (Deaf), ఆటిజం (Autism) తో బాధపడే పిల్లలు.. వీరందరూ ఒకే స్టేజ్ (Stage) పై అద్భుతమైన డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే అసాధ్యంగా అనిపించే ఈ ఫీట్‌ను 15 ఏళ్ల కూచిపూడి డాన్సర్ అక్షర దేవళ్ల సుసాధ్యం చేసింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా 150 మంది దివ్యాంగ విద్యార్థులతో ఆమె చేయించిన 'వందేమాతరం' (Vande Mataram) నృత్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

15-Year-Old Akshara Devalla Teaches Dance to 150 Specially-Abled Kids

"జాలి కాదు.. అవకాశం కావాలి"

"వాళ్లకు జాలి అవసరం లేదు.. అవకాశం ఇస్తే చాలు".. ఇదే ఆలోచనతో అక్షర ఈ అరుదైన ప్రాజెక్టును చేపట్టింది. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్, మలక్‌పేట ఫిన్ డెఫ్ స్కూల్, కవాడిగూడ సుమన్ ఆటిజం సెంటర్, అలాగే ఆదిలాబాద్‌కు చెందిన విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ (Special School) విద్యార్థులను దీనికోసం ఎంచుకుంది. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పూర్తి ఆరు చరణాల వందేమాతరం గీతానికి అద్భుతంగా డాన్స్ (Dance) చేయించి మన్ననలు అందుకుంది.

15-Year-Old Akshara Devalla Teaches Dance to 150 Specially-Abled Kids

వందేమాతరం @150 మిషన్

సాధారణంగా టీనేజర్స్ (Teenagers) చదువు, కెరీర్ అంటూ బిజీగా ఉంటారు. కానీ అక్షర మాత్రం "వందేమాతరం @150" పేరుతో జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరికీ చేర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. గతంలో కార్గిల్ (Kargil) మంచుకొండల్లో కాలికి చెప్పులు లేకుండా వందేమాతరం గేయానికి నృత్యం చేసింది. అలాగే బంకిమ్ చంద్ర ఛటర్జీ నివాసాన్ని సందర్శించి యువతకు ఈ గీత చరిత్రను పరిచయం చేసింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు స్పెషల్ చిల్డ్రన్‌తో ఈ భారీ కార్యక్రమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహించింది.

15-Year-Old Akshara Devalla Teaches Dance to 150 Specially-Abled Kids

టచ్ (Touch) తో డాన్స్ ట్రైనింగ్

ఈ నృత్య ప్రదర్శన వెనుక అక్షర పడిన కష్టం అంతాఇంతా కాదు. ముఖ్యంగా అంధ విద్యార్థులకు డాన్స్ నేర్పించడం అంటే మామూలు విషయం కాదు. వారికి స్టెప్స్ చేసి చూపిస్తే కనిపించదు, అందుకే పాటకు అర్థం చెప్పి, ముఖకవళికలు, చేతులు, కాళ్ల కదలికలను కేవలం స్పర్శ (Touch) ద్వారా మాత్రమే ఎంతో ఓపికగా నేర్పించింది. వందేమాతరంతో పాటు దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు శ్రీనివాస కల్యాణాన్ని కూడా కూచిపూడి నృత్య శైలిలో నేర్పించింది. దివ్యాంగ చిన్నారుల జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని మిగిల్చిన అక్షర.. లోపం శరీరానికే కానీ వారి ప్రతిభకు కాదని ప్రపంచానికి చాటిచెప్పింది.

Advertisement
Advertisement