త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | ప్ర‌ధాని మోదీనే అతిపెద్ద చొర‌బాటుదారు.. బెంగాల్‌ను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు : మ‌మ‌తా బెన‌ర్జీ

Mamata Banerjee | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌ధాని మోదీ అతిపెద్ద చొర‌బాటుదారు (Modi biggest infiltrator) అని వ్యాఖ్యానించారు.

D

National | Published On Mar 21, 2026, 2.53 pm IST

Mamata Banerjee | ప్ర‌ధాని మోదీనే అతిపెద్ద చొర‌బాటుదారు.. బెంగాల్‌ను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు : మ‌మ‌తా బెన‌ర్జీ
Advertisement

Mamata Banerjee | అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప‌శ్చిమ బెంగాల్‌లో రాజ‌కీయాలు వేడెక్కాయి. నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల‌కు ఎక్కుపెట్టారు. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈద్ అల్ ఫిత‌ర్ సంద‌ర్భంగా కోల్‌క‌తాలోని రెడ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఈద్ కార్య‌క్ర‌మంలో దీదీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ అతిపెద్ద చొర‌బాటుదారు (Modi biggest infiltrator) అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌జ‌ల‌ను విభ‌జించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. అలాంటి ప్ర‌య‌త్నాల‌ను తాము అడ్డుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాన్ని ల‌క్ష్యంగా చేసుకున్న వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు.

"బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకునే వారిని వ‌దిలిపెట్టేది లేదు. ప్ర‌ధాని మోదీ, బీజేపీ నేత‌లే అతిపెద్ద చొరబాటుదారులు" అని మమత పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రంలో అక్ర‌మ వ‌ల‌స‌లు కీల‌క అంశంగా మారిన విష‌యం తెలిసిందే. భారీ స్థాయిలో జ‌రుగుతున్న చొర‌బాటు రాష్ట్ర జ‌నాభా స్వ‌రూపాన్ని మార్చేసింద‌ని ప్ర‌ధాని మోదీ, అమిత్ షా ప‌దేప‌దే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా దీదీ ఈ విధంగా స్పందించారు.

ఇక వచ్చే నెలలో బెంగాల్‌లో జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేసే ఉద్దేశంతోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) చేపడుతున్నారని మమత ఆరోపించారు. స‌ర్ పేరుతో ఓటు వేసే హ‌క్కును బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్ర‌భుత్వం కాల‌రాస్తోంద‌ని ఆరోపించారు. స‌ర్‌ పేరుతో రాష్ట్రంలోని చాలా మంది ఓట్ల‌ను జాబితా నుంచి తొలగించార‌ని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు. "మోదీ, బీజేపీ ఎవరైనా సరే మీ ఓటు హక్కును లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోం. చివరివరకూ పోరాడతాం" అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Also Read..

MEA | భార‌త్ నుంచి ఇరాన్‌పై దాడుల‌కు యూఎస్ ప్లాన్‌..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ - వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌

జీవ‌న్ రెడ్డికి మంత్రుల బుజ్జ‌గింపులు.. లైట్ తీసుకున్న సీనియ‌ర్ నేత‌!

Advertisement

తాజావార్తలు

Advertisement