త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | జీవ‌న్ రెడ్డికి మంత్రుల బుజ్జ‌గింపులు.. లైట్ తీసుకున్న సీనియ‌ర్ నేత‌!

Jeevan Reddy | జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి (Jeevan Reddy) బుజ్జగింపులు (Persuasions) మొద‌ల‌య్యాయి. హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌తో భేటీకి గైర్హాజరైన నేపథ్యంలో శ‌నివారం మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీ‌ధ‌ర్‌బాబు, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, చొప్ప‌దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయ‌న ఇంటికి వెళ్లారు.

S

News | Published On Mar 21, 2026, 2.28 pm IST

Jeevan Reddy | జీవ‌న్ రెడ్డికి మంత్రుల బుజ్జ‌గింపులు.. లైట్ తీసుకున్న సీనియ‌ర్ నేత‌!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి (Jeevan Reddy) బుజ్జగింపులు (Persuasions) మొద‌ల‌య్యాయి. హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌తో భేటీకి గైర్హాజరైన నేపథ్యంలో శ‌నివారం మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీ‌ధ‌ర్‌బాబు, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, చొప్ప‌దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయ‌న ఇంటికి వెళ్లారు. జీవ‌న్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తాను ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను మంత్రుల‌కు వివ‌రించారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు తగ్గట్లు నేడు కాంగ్రెస్ పార్టీ (Congress party) లేదంటూ అసహనం వ్య‌క్తం చేశారు. పార్టీని వీడే విష‌య‌మై మంత్రుల‌తో చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈనెల 25న పార్టీకి రాజీనామా (Resign) చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అనంత‌రం మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. జీవ‌న్ రెడ్డి స‌మ‌స్య‌ల‌ను త‌మ‌కు వివ‌రించార‌ని.. వాటిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీ ఇచ్చామ‌ని వివ‌రించారు. రాజీనామా విష‌య‌మై జీవ‌న్‌రెడ్డి పున‌రాలోచ‌న చేస్తార‌ని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా మంత్రుల బుజ్జగింపులను జీవ‌న్‌రెడ్డి లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్‌తో గ‌త కొంత కాలంగా జీవ‌న్‌రెడ్డికి పొస‌గ‌డం లేదు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ సంజ‌య్ వ‌ర్గానికే పార్టీ ఎక్కువ టికెట్లు కేటాయించ‌డంతో జీవ‌న్‌రెడ్డి అల‌కబూనారు. త‌న‌కు పార్టీలో త‌గిన గౌర‌వ మ‌ర్యాద‌లు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement