త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MEA | భార‌త్ నుంచి ఇరాన్‌పై దాడుల‌కు యూఎస్ ప్లాన్‌..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

MEA | ప‌శ్చిమ భార‌త్ నుంచి ఇరాన్‌పై దాడికి యూఎస్ ప్లాన్ చేసిందంటూ వ‌స్తున్న (US planning to attack Iran from western India) వార్త‌ల‌ను విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.

D

National | Published On Mar 21, 2026, 2.05 pm IST

MEA | భార‌త్ నుంచి ఇరాన్‌పై దాడుల‌కు యూఎస్ ప్లాన్‌..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Advertisement

MEA | ప‌శ్చిమ భార‌త్ నుంచి ఇరాన్‌పై దాడికి యూఎస్ ప్లాన్ చేసిందంటూ వ‌స్తున్న (US planning to attack Iran from western India) వార్త‌ల‌ను విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాలే అని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఎమ్ఈఏకి (MEA) చెందిన ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చింది.

కాగా, ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా ప‌శ్చిమ భార‌త (western India) ప్రాంతాన్ని ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంద‌ని ఇటీవ‌లే వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకోసం లెమోవా (LEMOA) ఒప్పందాన్ని యూఎస్ వాడుకుంటోంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కొంక‌ణ్ తీర ప్రాంతంలో సైనిక మోహ‌రింపు ఉండొచ్చంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇరాన్‌పై దాడుల‌కు అమెరికా నౌకాదళం భారత పోర్టులను ఉపయోగించేందుకు ఇండియా సాయం కోరిందంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంపై కేంద్రం తాజాగా స్పందించింది. ఈ మేర‌కు ఆ వార్త‌ల‌ను ఖండించింది. అవ‌న్నీ అస‌త్య ప్ర‌చారాలంటూ కొట్టిపారేసింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఇలాంటి త‌ప్పుడు, నిరాధార‌మైన క‌థ‌నాలు, పోస్టుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

https://x.com/MEAFactCheck/status/2035212514385175013

అస‌లేంటి ఈ లెమోవా ఒప్పందం..

లెమోవా (LEMOA - Logistics Exchange Memorandum of Agreement) అనేది ఆగస్టు 2016లో భార‌త్‌-అమెరికా మ‌ధ్య కుదిరిన ఓ కీల‌క‌మైన ర‌క్ష‌ణ లాజిస్టిక్స్ ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల నౌకాదళాలు, వైమానిక దళాలు, సైన్యం అవసరమైనప్పుడు ఒకరికొకరు సేవలు, సరఫరాలు, మరమ్మతులు వంటి సేవలు అందించుకోవచ్చు. ఈ ఒప్పందం కేవలం లాజిస్టికల్ సహకారానికి మాత్రమే పరిమితం. కానీ ఏ దేశం కూడా మరో దేశ భూభాగాన్ని ఉపయోగించి యుద్ధ చర్యలు చేపట్టే అవకాశం ఈ ఒప్పందంలో లేదు. అలాగే ఇలాంటి ఒప్పందాలు స్వయంచాలకంగా అమల్లోకి రావు. ప్రతి సందర్భంలో వేర్వేరు స్థాయిల్లో అనుమతులు అవసరం.

Also Read..

వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌.. ఆ రూట్‌లో సాయంత్రం 4 నుంచి ట్రాఫిక్ ఆంక్ష‌లు

వాట్సాప్‌, ఫేస్‌బుక్ క‌న్నా ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్ తోనే ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా మాన‌సిక స‌మ‌స్య‌లు

యుద్ధం మ‌రింత తీవ్రం.. హిందూ మ‌హాస‌ముద్రంలోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

Advertisement

తాజావార్తలు

Advertisement