త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Punarnavi Bhupalam | ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ – వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌

బిగ్‌బాస్ బ్యూటీ పున‌ర్న‌వి భూపాలం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు హేమంత్ వ‌ర్మ‌ను పెళ్లిచేసుకుంది. పున‌ర్న‌వి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Mar 21, 2026, 2.40 pm IST

Punarnavi Bhupalam | ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ – వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌
Advertisement

Punarnavi Bhupalam |  బిగ్‌బాస్ ఫేమ్‌, టాలీవుడ్ న‌టి పున‌ర్న‌వి భూపాలం పెళ్లి చేసుకుంది. ప్రియుడు హేమంత్ వ‌ర్మ‌తో పున‌ర్న‌వి భూపాలం వివాహం శుక్ర‌వారం రాత్రి జ‌రిగింది. పున‌ర్న‌వి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. హేమంత్ వ‌ర్మ ఫొటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడ‌ట‌. చాలా కాలంగా అత‌డితో పున‌ర్న‌వి ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్‌లో ప్రియుడిని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఫిబ్ర‌వ‌రిలో పున‌ర్న‌వి, హేమంత్ వ‌ర్మ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. నిశ్చితార్థం జ‌రిగిన నెల‌లోపే ఈ జంట పెళ్లిపీట‌లు ఎక్కారు.

ఉయ్యాల జంపాల‌...

ఉయ్యాల జంపాల మూవీతో పున‌ర్న‌వి యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ఈ సినిమాలో హీరోయిన్ అవికాగోర్ స్నేహితురాలి పాత్ర‌లో క‌నిపించింది. ఈ సినిమా హిట్ట‌యిన పున‌ర్న‌వికి ఆశించిన పేరు మాత్రం ద‌క్క‌లేదు. బిగ్‌బాస్ సీజ‌న్ 3లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. ఈ సీజ‌న్‌లో 80వ రోజు వ‌ర‌కు హౌజ్‌లో కొన‌సాగింది. ఒకానొక‌ద‌శ‌లో ఫైన‌ల్ చేరుకుంటుంద‌ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది.

చాలానే సినిమాలు...

బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో తెలుగులో పున‌ర్న‌వికి చాలానే అవ‌కాశాలు వ‌చ్చాయి. పిట్ట‌గోడ‌, మ‌న‌సుకు న‌చ్చింది, సైకిల్‌, ఎందుకో ఏమో, ఒక చిన్న‌విరామంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో న‌టించింది. క‌మిట్‌మెంట‌ల్ అనే వెబ్‌సిరీస్ కూడా చేసింది. కానీ ఇవేవీ ఆమెకు విజ‌యాల‌ను తెచ్చిపెట్టింది. కెరీర్ ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన పున‌ర్న‌వి సైకాల‌జీలో ఉన్న‌త చ‌దువుల కోసం లండ‌న్ వెళ్లింది.

Advertisement

తాజావార్తలు

Advertisement