MK Stalin | డీలిమిటేషన్‌పై రాజీ ప్రసక్తే లేదు : డీఎంకే
MK Stalin | లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని (DMK wont compromise) డీఎంకే స్పష్టం చేసింది. మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న ఈ బిల్లు విషయంలో తమ రెండు ప్రధాన డిమాండ్లపై దృఢంగా ఉన్నట్లు ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ (MKStalin) స్పష్టంచేశారు.
MK Stalin | త్రినేత్ర న్యూస్ : నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లుల (Women reservation Bill) ను ఎలాగైనా సరే పార్లమెంటులో ఆమోదింపజేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ఎన్డీఏ (NDA) పక్షం నవంబరు 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సమావేశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సమావేశాల నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే (DMK) పార్టీ కేంద్రంలోని అధికార బీజేపీతో పొత్తు పెట్టుకోబోతోందనంటూ ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే గవర్నర్ అర్లేకర్ తో విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ భేటీ వెనుక మర్మం ఇదేనని టీవీకే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తు వార్తలపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) ఘాటుగా స్పందించారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎదురయ్యే నష్టాలపై దేశంలోనే తొలిసారిగా గళమెత్తింది డీఎంకేనేనని తెలిపారు. న్యాయమైన పునర్విభజన కోసం జాతీయ నేతలందరినీ ఏకతాటిపైకి తెస్తూ చెన్నైలోనే తొలి సమావేశం నిర్వహించిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం, ఫెయిర్ డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు తాము కట్టుబడి ఉన్నామని స్టాలిన్ స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న ఈ బిల్లు విషయంలో తమ రెండు ప్రధాన డిమాండ్లపై దృఢంగా ఉన్నట్లు స్టాలిన్ స్పష్టంచేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచినట్లయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటా తగ్గకూడదని, 1971 జనాభా లెక్కల (1971 Census) ఆధారంగా గతంలో స్థిరీకరించిన రాష్ట్రాల మధ్య ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటూ యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్ల విషయంలో డీఎంకే అస్సలు వెనక్కి తగ్గేదే లేదన్నారు. భవిష్యత్తులోనూ వీటిపై తమ వైఖరి ఇదే అని స్టాలిన్ తేల్చిచెప్పేశారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండదన్నారు. తమిళనాడు ప్రయోజనాల విషయంలో డీఎంకే ఎప్పటికీ రాజీపడదని, తమ సిద్ధాంతాల నుంచి పక్కకు తప్పుకోదని స్టాలిన్ ఈ సందర్భంగా స్పష్టతనిచ్చారు.
தொகுதி மறுவரையறையால் ஏற்படக்கூடிய பாதிப்புகள் குறித்து இந்தியாவிலேயே முதன் முதலில் குரல் எழுப்பியது தி.மு.க.தான்!
நியாயமான மறுவரையறை என்ற கோரிக்கையுடன் அகில இந்தியத் தலைவர்களை ஒன்றிணைத்து முதன் முதலில் கூட்டம் நடத்தப்பட்டதும், சென்னையில்தான்.
தமிழ்நாடு சட்டமன்றத்தில் நிறைவேற்றிய தீர்மானத்தின்படியும், நியாயமான தொகுதி மறுவரையறைக்கான கூட்டு நடவடிக்கைக் குழுக் கூட்டத்தில் நிறைவேற்றிய தீர்மானங்களின்படியும், நாம் முன்வைத்த உறுதியான கோரிக்கைகள்:
• நாடாளுமன்றத் தொகுதிகளின் எண்ணிக்கை உயர்த்தப்பட்டால், எக்காரணத்தைக் கொண்டும், தமிழ்நாட்டின் பங்கு தற்போதுள்ள 7.18%-ல் இருந்து குறையக் கூடாது!
• 1971 மக்கள்தொகை அடிப்படையில், மாநிலங்களுக்கு இடையேயான நாடாளுமன்றப் பிரதிநிதித்துவ விகிதாசாரத்தின் அடிப்படையில் நிர்ணயிக்கப்பட்டு, முன்னர் நிலைப்படுத்தப்பட்டவாறே, அடுத்த 25 ஆண்டுகளுக்கும் எந்தவித மாற்றமும் செய்யப்படக் கூடாது!
எடுத்த இந்த இரண்டு நிலைப்பாட்டிலும் தி.மு.க. இன்றும் என்றும் உறுதியாக இருக்கிறது. இந்த நிலைப்பாட்டில் எந்த மாற்றமும் இல்லை, சமரசம் என்ற பேச்சுக்கே இடமில்லை!
ஊடகங்களில் பரப்பப்படும் ஊகங்களும், முதுகுகுத்திகளின் முணுமுணுப்புகளும் எங்களது இந்த நிலைப்பாட்டை எந்த விதத்திலும் அசைத்துப் பார்க்காது.
பதவிக்காகக் கொள்கையை உதறிவிட்டுச் செல்லும் மானமற்ற, நன்றிகெட்ட கூட்டத்தினர் இதனை உணர வேண்டும்.
தமிழ்நாட்டின் நலனைக் கழகம் ஒருபோதும் விட்டுக்கொடுக்காது. கொண்ட கொள்கையில் இருந்து தடம் மாறாது!
The DMK was the first in India to raise its voice against the dangers of delimitation!
It was only in Chennai that political leaders from across the country came together for the first time to demand fair delimitation.
In keeping with the resolution passed by the Tamil Nadu Legislative Assembly and the resolutions adopted at the Joint Action Committee meeting for #FairDelimitation, we put forth two categorical demands:
• If the number of parliamentary constituencies is increased, under no circumstances should Tamil Nadu’s existing 7.18% share of seats in the lower house be reduced!
• The existing proportion of parliamentary representation among States, as determined on the basis of the 1971 Census and frozen earlier, must remain frozen for another 25 years!
The DMK stands firm on these two demands and will continue to do so. There is no change in our position, and there is no question of any compromise!
Neither the speculations being circulated in the media nor the wails of backstabbers can shake our resolve.
The shameless and ungrateful lot who abandoned their principles for positions of power must realise this.
The DMK will never compromise on Tamil Nadu’s interests. Nor will it depart from its principles!
— M.K.Stalin (@mkstalin) November 27, 2026
Also Read..
బీజేపీకి ఇదే అతిపెద్ద రాజకీయ తప్పిదం కానుంది : అఖిలేష్ యాదవ్
లోక్‌సభలో మెజారిటీ కోసం మోదీ ప్రభుత్వం కుట్ర: కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
కూకట్‌పల్లి ట్రక్‌పార్క్ భూముల వేలానికి లైన్ క్లియర్.. పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pakistan-occupied Kashmir | పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..
నవంబర్ 28, 2026

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
నవంబర్ 28, 2026

Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
- ●Serial Actor | పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్టర్ - ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్
- ●Delimitation & Constitutional Imbalance | లోక్‌సభ సీట్ల పెంపు సరే .. మరి రాజ్యసభ సంగతేంది?
- ●RIMS Incident | గర్భిణీ మృతి ఘటన.. రిమ్స్ వైద్యురాలికి ఉద్వాసన
- ●Bigg Boss Mukesh Gowda | బిగ్‌బాస్ ముఖేష్ గౌడ తెలుగు సినిమా - లవ్‌స్టోరీతో హీరోగా ఎంట్రీ..

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Serial Actor | పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్టర్ - ఫొటోలపై ఓ లుక్కేయండి!

BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్

Delimitation & Constitutional Imbalance | లోక్‌సభ సీట్ల పెంపు సరే .. మరి రాజ్యసభ సంగతేంది?



