త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Mukesh Gowda | బిగ్‌బాస్ ముఖేష్ గౌడ తెలుగు సినిమా – ల‌వ్‌స్టోరీతో హీరోగా ఎంట్రీ..

ప్ర‌స్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో టాప్ కంటెస్టెంట్‌గా కొన‌సాగుతోన్నాడు ముఖేష్ గౌడ . విన్న‌ర్‌గా త్రిగుణ్‌తో పాటు ఇత‌డి పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా ముఖేష్ గౌడ హీరోగా మారాడు. తెలుగులో ల‌వ్‌స్టోరీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమా టైటిల్‌తో పాటు హీరోయిన్ ఎవ‌రంటే?

N

Entertainment | Published On Nov 28, 2026, 6.37 pm IST

Bigg Boss Mukesh Gowda |  బిగ్‌బాస్ ముఖేష్ గౌడ తెలుగు సినిమా – ల‌వ్‌స్టోరీతో హీరోగా ఎంట్రీ..
Advertisement

Bigg Boss Mukesh Gowda | బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో(Bigg Boss 10 Telugu) ప్ర‌స్తుతం నంబ‌ర్‌వ‌న్ కంటెస్టెంట్‌గా కొన‌సాగుతోన్నాడు ముఖేష్ గౌడ‌ (Mukesh Gowda). త్రిగుణ్‌కు గ‌ట్టి పోటీ ఇస్తూ విన్న‌ర్ రేసులో నిలిచాడు. నిజాయితీతో కూడిన ఆట‌తీరుతో అభిమానుల మ‌న‌సుల‌ను గెలుచుకుంటున్నాడు . ముఖేష్ ఫైన‌ల్ చేరుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంది.

గీతా శంక‌రం....

బిగ్‌బాస్ ముఖేష్ హీరోగా తెలుగులో ఓ సినిమా రాబోతుంది. గీతాశంక‌రం పేరుతో ల‌వ్‌స్టోరీ చేయ‌బోతున్నాడు. చాలా రోజుల క్రిత‌మే ఈ సినిమా మొద‌లైంది. అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డిలే అయ్యింది. బిగ్‌బాస్‌తో ముఖేష్‌కు మంచి క్రేజ్ రావ‌డంతో గీతా శంక‌రం సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ....

గీతా శంక‌రం సినిమాతోనే హీరోగా ముఖేష్ గౌడ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ సినిమారు రుద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రియాంక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ ల‌వ్‌స్టోరీ నుంచి మ‌ట్టిబుర్ర అనే పాట‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందించాడు. శ్వేతా మోహ‌న్ ఆల‌పించిన ఈ పాట అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యింది.

గుప్పెడంత మ‌న‌సుతో...

బిగ్‌బాస్ సీజ‌న్ 10 ముగిసిన వెంట‌నే గీతా శంక‌రం రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో తెలుగులో ఫేమ‌స్ అయ్యాడు ముఖేష్ గౌడ‌. స్టార్‌మాలో టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్‌లో రిషి అనే పాత్ర‌లో క‌నిపించాడు. ల‌వ‌ర్‌బాయ్‌గా, కాలేజీ ఓన‌ర్‌గా రెండు వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌తో అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. క‌న్న‌డంలో కొన్ని సినిమాలు, సీరియ‌ల్స్ చేశాడు. సినిమాల కోసం త‌న పేరును నిహార్ ముఖేష్‌గా మార్చుకున్నాడు.

 

Advertisement
Advertisement