త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

massive protest | రాముడిని అవ‌మానించార‌ని క‌దం తొక్కిన హిందూ స‌మాజం.. జై శ్రీ‌రామ్ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఢాకా

massive protest | బంగ్లాదేశ్‌లో ( Bangladesh) ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. శ్రీరాముడిని అవమానించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం క‌దం తొక్కింది (massive protest). ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని 72 గంట‌ల్లోగా అరెస్ట్ చేయాల‌ని అల్టిమేటం జారీ చేశారు.

D

International | Published On Jun 20, 2026, 2.45 pm IST

massive protest | రాముడిని అవ‌మానించార‌ని క‌దం తొక్కిన హిందూ స‌మాజం.. జై శ్రీ‌రామ్ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఢాకా
Advertisement

massive protest | బంగ్లాదేశ్‌లో ( Bangladesh) ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. శ్రీరాముడిని అవమానించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం క‌దం తొక్కింది (massive protest). శుక్రవారం రాత్రి రాజధాని ఢాకా (Dhaka)లో హిందూ సంఘాలు (Hindus), విశ్వవిద్యాలయ విద్యార్థులు కాగ‌డాల‌ ప్రదర్శన నిర్వహించారు. జై శ్రీ‌రామ్ అంటూ నినాదాలు (Jai Shri Ram chants) చేశారు.

ఉత్తర బంగ్లాదేశ్‌లోని గైబంధా జిల్లాలోని పలాష్‌బరిలో 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని చేప‌ట్టారు. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా నిలిచేది. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, ప్ర‌స్తుతం ఈ నిర్మాణం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇస్లామిక్ గ్రూపుల నుంచి అధికారులకు బెదిరింపులు వచ్చాయని 'శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ' ప్రతినిధులు ఆరోపించారు. శాంతి భద్రతల దృష్ట్యా పనులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.

రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ వర్గాలు చేసిన చర్యల ప‌ట్ల‌ హిందూ సమాజం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు తీవ్ర‌వాద ఇస్లామిస్టులు శ్రీ‌రాముడి చిత్రాన్ని అవ‌మానించార‌ని నిర‌స‌న‌కారులు ఆరోపించారు. ఈ ఘటన హిందువుల మనో భావాలను తీవ్రంగా గాయపరిచిందని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా శుక్ర‌వారం రాత్రి హిందూ సంఘాలు మాన‌వ‌హారంగా ఏర్ప‌డి ఢాకా వీధుల్లో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

ఈ ఘ‌ట‌న‌పై తారిఖ్ రెహ‌మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ (BNP) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిర‌స‌న‌కారులు ఆరోపించారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని 72 గంట‌ల్లోగా అరెస్ట్ చేయాల‌ని అల్టిమేటం జారీ చేశారు. చ‌ర్య‌లు తీసుకోక‌పోతే దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మరోవైపు, శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతించకపోతే.. బంగ్లాదేశ్‌లోని మొత్తం 64 జిల్లాలలో ఒక్కొక్కటిగా రామాలయాలను నిర్మిస్తామని హిందూ మహాజోత్ స్పష్టం చేసింది.

Also Read..

మోదీ గ్రేట్ లీడ‌ర్.. యుద్ధాల‌కు దూరంగా ఉంటారు.. ప్ర‌ధానిపై ట్రంప్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

అమెరికా అధ్య‌క్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖ‌తార్‌

పిల్ల‌ల భ‌విష్య‌తుత్తో జూదం ఆడ‌టం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్‌

Advertisement
Advertisement