త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | తండ్రి సినిమాలో శృతి హాస‌న్ – రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌లోనే….

దాదాపు న‌ల‌భై ఐదేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తోన్నారు. నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో శృతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌మ‌ల్‌హాస‌న్ కూతురిగానే రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ చేస్తోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Jun 20, 2026, 3.25 pm IST

Shruti Haasan | తండ్రి సినిమాలో శృతి హాస‌న్ – రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌లోనే….
Advertisement

Shruti Haasan |  ఈ ఏడాది కోలీవుడ్ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ మ‌ల్టీస్టార‌ర్ ఒక‌టి. దాదాపు 45 లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ ఇద్ద‌రూ అగ్ర హీరోల క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమాకు నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను క‌మ‌ల్‌హాస‌న్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌ల‌పై ఓ స్పెష‌ల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో రికార్డ్ వ్యూస్‌ను సాధించింది. క‌మ‌ల్, ర‌జ‌నీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. ఆగ‌స్ట్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

తండ్రీకూతుళ్ల క‌ల‌యిక‌లో...

కాగా ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ త‌న‌య శృతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌ల‌ను శృతి హాస‌న్ ప్ర‌త్యేకంగా క‌లిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ సినిమా గురించి ఇద్ద‌రూ స్టార్స్‌ను శృతి క‌లిసిన‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. క‌మ‌ల్‌హాస‌న్‌, శృతి హాస‌న్ క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కు ఒకే ఒక సినిమా చేశారు. హేరామ్‌లో చైల్డ్ యాక్ట‌ర్‌గా శృతి క‌నిపించింది. దాదాపు 26 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తండ్రీకూతుళ్ల క‌ల‌యిక‌లో సినిమా రాబోతుండ‌టంతో అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. నెల్స‌న్ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌, శృతి హాస‌న్ రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ల‌లోనే క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తండ్రీకూతుళ్లుగానే న‌టిస్తార‌ని అంటున్నారు.

క‌లిసింది నిజ‌మే...

తండ్రితో క‌లిసి సినిమా చేస్తోన్న‌ట్లు వ‌స్తోన్న రూమ‌ర్ల‌పై శృతి హాస‌న్ రియాక్ట్ అయ్యింది. అవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని అన్న‌ది. "క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌ల‌ను క‌లిసిన మాట వాస్త‌వ‌మే. కానీ సినిమా కోసం కాదు. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో భాగం కావాల‌ని నాకు ఉంది. అవ‌స‌రం లేక‌పోయినా నా కోసం ప్ర‌త్యేకంగా క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేయ‌డం న‌చ్చ‌దు. అంద‌రూ అభిమానుల్లానే నేను ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా" అని శృతి హాస‌న్ చెప్పింది.

ప్ర‌స్తుతం శృతి హాస‌న్ తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement
Advertisement