త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్‌పై మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

Koppula Eshwar | చేవెళ్ల ఎస్సీ-ఎస్టీ డిక్ల‌రేష‌న్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసింద‌ని, అమ‌లు కోసం ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే లేఖ రాస్తామ‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న బీఆర్ఎస్ నేత‌ల‌తో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ని కాంగ్రెస్ నేత‌లు నేత‌లు మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేద‌ని ఆరోపించారు.

P

Telangana | Published On Jun 20, 2026, 6.10 pm IST

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్‌పై మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌
Advertisement

Koppula Eshwar | చేవెళ్ల ఎస్సీ-ఎస్టీ డిక్ల‌రేష‌న్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసింద‌ని, అమ‌లు కోసం ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే లేఖ రాస్తామ‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న బీఆర్ఎస్ నేత‌ల‌తో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ని కాంగ్రెస్ నేత‌లు నేత‌లు మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ ఎస్సీ-ఎస్టీల‌ను ఓటు బ్యాంక్‌గా చూసుకుంద‌ని, ఓట్ల‌ను దండుకొని వారిని విస్మ‌రించింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. చేవెళ్ల ప్ర‌జాగ‌ర్జ‌న స‌భ ద్వారా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను పిలిచి డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. మల్లిఖార్జున్ ఖర్గే, అంబేద్కర్ గౌరవాన్ని కాంగ్రెస్ కించపరిచింద‌న్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింద‌ని తెలిపారు. దళితబంధుపై ప‌థ‌కంపై కాంగ్రెస్ నేత‌లు విషం చిమ్మార‌ని, దళితులను రెచ్చగొట్టి లబ్ది పొందార‌ని విమ‌ర్శించారు. అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింద‌ని, ఇంగితం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎస్సి, ఎస్టీల రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింద‌ని ఆరోపించారు.

ఇందిర‌మ్మ ఇండ్లు ఆరంభ శూరత్వ‌మ‌ని విమ‌ర్శించారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామ‌ని మోసం చేసింద‌ని ఆరోపించారు. 30 నెలల్లో 57వేల ఇందిరమ్మ ఇళ్లు మాత్రమే పూర్తి చేశార‌న్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెద్ద,పెద్ద మాటలు మాట్లాడుతున్నార‌ని, కారణం లేకుండా పేదల ఇళ్లను ప్రభుత్వం కూలుస్తోంద‌న్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాయ‌కులు రూ,50వేల నుంచి లక్ష వసూలు చేస్తున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నార‌ని, కేసీఆర్ 4లక్షలకుపైగా పోడు భూములకు పట్టా ఇచ్చార‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో ఒక్క ఎకరానికి అయినా పట్టాలు ఇచ్చారా? అంటూ నిల‌దీశారు. కాంగ్రెస్ పార్టీ దళిత ద్రోహుల పార్టీగా నిలిచిపోతుంద‌న్నారు. ఎస్సి, ఎస్టీలకు ఫీజు రియంబర్స్‌మెంట్ రూ.200 కోట్లు రిలీజ్ చేయడం లేద‌న్నారు. కేసీఆర్ 1100 గురుకులాలు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ స్కూళ్లలో లక్షా 25 వేల మంది సంఖ్య తగ్గింద‌న్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కనుమరుగు అయింద‌ని, ధర్మపురిలో స్టడీ సర్కిల్ కు అడ్లూరి లక్ష్మణ్ తాళం వేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల పేరు వాడుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. బస్సు యాత్ర పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసం చేయాలని చూస్తున్నార‌న్నారు.

మాజీ ఎంపీ మాలోతు క‌విత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు సంబరాల పేరుతో ఊరేగింపుకు బయలుదేరార‌ని, కాంగ్రెస్ నేతలు బస్సుల్లో తిరగండి, హెలికాప్టర్లలో తిరగండి మాకు అభ్యంతరం లేద‌న్నారు. రాష్ట్రంలో ఒక్క ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి అయినా న్యాయం చేశారా? అంటూ నిల‌దీశారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు ఇళ్లకు పరిమితం అయ్యార‌ని, కాంటాక్టుల్లో రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌న్నార‌ని, దీనిపై ఆ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు మాట్లాడాల‌ని స‌వాల్ విసిరారు. రెండున్నరేళ్ళలో 50 వేల ఎకరాల అసైన్డ్ భూమిని కాంగ్రెస్ లాక్కుంద‌ని, లగచర్లలో గిరిజన బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన వినే వాళ్ళను పిలిపించుకుని సంబురాలు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అలియాస్ హిట్లర్ రెడ్డిగా మారార‌ని, సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో దళితులు, గిరిజనుల బ‌తుకులు ఏం మారాయని ప్ర‌శ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు తమ బిడ్డలను అమ్ముకున్నారని, చేవెళ్ల డిక్లరేషన్ గురించి హిట్లర్ రెడ్డి చెప్పాల‌న్నారు. ప్రతి దళిత, గిరిజన బిడ్డలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల‌న్నారు. దళిత, గిరిజనులకు ఇస్తామన్న రిజర్వేషన్ల గురించి ఎందుకు బస్సు యాత్ర చేయడం లేద‌న్నారు. మంత్రి వర్గంలో గిరిజనులకు రిజర్వేషన్ ఎందుకు లేదని, మంత్రి వర్గంలో లంబాడాలకు చోటు లేద‌ని ప్ర‌శ్నించారు. లగచర్లలో గిరిజన బిడ్డలను చిత్రహింసలు పెట్టార‌ని, హైడ్రా నాటకంతో దళిత,గిరిజనుల ఇళ్లను కూలుస్తున్నార‌ని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి కూల్చుడు రెడ్డి అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. గిరిజనులకు రిజర్వేషన్ ఫలాలను కేసీఆర్ అందించార‌ని, ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి 4వేల స్కూళ్లకు పరిమితం చేస్తామని హిట్లర్ రెడ్డి అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పేది అన్ని ఉత్త ముచ్చట్లని, కేసీఆర్ ఇచ్చిన స్కాలర్ షిప్ లతో చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నార‌ని, రేవంత్ రెడ్డి సంబురాలు ఎందుకు అంటూ నిల‌దీశారు. ఈ స‌మావేశంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్, రేగా కాంతారావు, చంటి క్రాంతి కిరణ్, సుంకె రవిశంకర్, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement