త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | స‌మంత త‌ల్లి కాబోతుందా? – మా ఇంటి బంగారం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత త‌ల్లి కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శ‌నివారం మా ఇంటి బంగారం మూవీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత పాల్గొన్న‌ది. ఈ వేడుక‌ల్లో స‌మంత బేబీ బంప్‌తో క‌నిపించింది. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Jun 20, 2026, 6.01 pm IST

Samantha | స‌మంత త‌ల్లి కాబోతుందా? – మా ఇంటి బంగారం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ఫొటోలు వైర‌ల్‌
Advertisement

Samantha | మా ఇంటి బంగారం మూవీతో దాదాపు మూడేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది స‌మంత‌. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత ఈ సినిమాను నిర్మించింది.

ఆల్‌రౌండ‌ర్‌...

మా ఇంటి బంగారంలో స‌మంత న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. మాజీ న‌క్స‌లైట్‌గా, త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి పోరాడే కోడ‌లిగా యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించింది. ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకుంది. గ్లామ‌ర్ క్వీన్ ఇమేజ్‌కు భిన్నంగా సినిమా మొత్తం చీర‌లోనే క‌నిపించింది.ఈ వారం రిలీజైన సినిమాల్లో పాజిటివ్ టాక్‌తో మా ఇంటి బంగారం దూసుకుపోతుంది. తొలి రోజు 13 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

బేబీ బంప్‌తో...

శ‌నివారం మా ఇంటి బంగారం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత పాల్గొన్న‌ది. ఈ ఈవెంట్‌లో స‌మంత బేబీ బంప్‌తో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆమె త‌ల్లి కాబోతుంద‌ని అంటున్నారు. స‌మంత బేబీ బంప్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌మంత‌కు నెటిజ‌న్ల‌తో పాటు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ రూమ‌ర్ల‌పై స‌మంత‌తో పాటు రాజ్ నిడిమోరు మాత్రం రియాక్ట్ కాలేదు.

రెండో వివాహం...

నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన స‌మంత గ‌త ఏడాది డిసెంబ‌ర్ 1న డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. ఇద్ద‌రికి ఇది రెండో వివాహ‌మే. కోయంబ‌త్తూరులోని ఇషా యోగ సెంట‌ర్‌లో నిరాడంబ‌రంగా వీరి వివాహం జ‌రిగింది.

Advertisement
Advertisement