Leopard Attack IIT Bombay | ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించిన చిరుత.. వీధి కుక్కను దారుణంగా వేటాడి.. VIDEO
ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించిన ఓ చిరుతపులి.. వీధి కుక్కను దారుణంగా వేటాడిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు స్థానికులను, విద్యార్థులను వణికిస్తోంది.
Viral news | Published On Jun 20, 2026, 3.07 pm IST
Leopard attack IIT Bombay | త్రినేత్ర.న్యూస్ : ముంబైలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే (IIT-Bombay) క్యాంపస్‌లో ఓ చిరుతపులి సృష్టించిన బీభత్సం.. ఇప్పుడు అక్కడ ఉంటున్న స్టూడెంట్స్, స్టాఫ్ మెంబర్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జూన్ 19వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పొవై క్యాంపస్‌లోని స్టాఫ్ హాస్టల్ ఏరియాలోకి చొరబడిన ఓ చిరుత.. వీధి కుక్కపై దాడి చేసి దారుణంగా చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
వైరల్ అవుతున్న ఈ సీసీటీవీ వీడియోలో.. స్టాఫ్ హాస్టల్ మెట్ల దగ్గర నిల్చున్న ఓ వీధి కుక్క, ఏదో ప్రమాదం పొంచి ఉందన్నట్లుగా భయంతో కుడివైపు చూడటం మనం గమనించవచ్చు. ఆ తర్వాతి క్షణంలోనే ఫ్రేమ్‌లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన చిరుత.. ఒక్కసారిగా ఆ కుక్క మీదకు దూకింది.
తనను తాను కాపాడుకోవడానికి కుక్క కాసేపు పోరాడినా.. చిరుత బలం ముందు నిలబడలేకపోయింది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే కుక్క మెడను బలంగా పట్టుకున్న చిరుత, దాన్ని అక్కడికక్కడే మట్టుబెట్టింది. ఆ తర్వాత దాన్ని మెల్లగా చీకట్లోకి లాక్కెళ్లిపోయింది.
క్యాంపస్‌లో భయాందోళనలు
క్యాంపస్ పక్కనే అటవీ ప్రాంతం (Sanjay Gandhi National Park) ఉండటంతో గతంలో కూడా పొవై ఏరియాలో చిరుతలు కనిపించిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఈసారి ఏకంగా స్టాఫ్ హాస్టల్ లాంటి రెసిడెన్షియల్ ఏరియాలోకి వచ్చి ఇలా దాడికి పాల్పడటం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది.
ఈ వీడియో చూసిన తర్వాత క్యాంపస్‌లోని విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట బయట తిరగాలంటేనే జంకుతున్నారు. క్యాంపస్‌లో నివసించే మనుషులతో పాటు, పెంపుడు జంతువుల భద్రతపై ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని రెసిడెంట్స్ కోరుతున్నారు.
A Leopard Entered IIT Bombay Campus at Staff Hostel and Viciously Attacked a Dog Caught on CCTV Camera😳 pic.twitter.com/bsfcUvBTXS
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 19, 2026
సంబంధిత వార్తలు

High-Rise Apartment Struggles | “పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!” – 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
సెప్టెంబర్ 22, 2026

IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగింపు.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో యాజమాన్యం కీలక నిర్ణయం
సెప్టెంబర్ 22, 2026

IIT Bombay | విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ సస్పెండ్
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
- ●ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?
- ●Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ
- ●Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
- ●DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన ఈగల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినందనలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం

ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్



