Abhijeet Dipke Slapped | జైపూర్‌లో హైడ్రామా: కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే చెంప చెల్లు.. వీడియో వైరల్!
జైపూర్‌లో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై ఓ వ్యక్తి దాడి చేశాడు. చెంపపై నాలుగుసార్లు కొట్టిన వైరల్ వీడియో మీకోసం.
Abhijeet Dipke Slapped | త్రినేత్ర.న్యూస్ : జైపూర్ (Jaipur) వేదికగా సోమవారం జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)పై ఓ గుర్తుతెలియని వ్యక్తి బహిరంగంగా దాడికి పాల్పడ్డాడు. సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆయన వెళ్తున్న సమయంలో ఈ ఊహించని ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న వీడియో ఫుటేజ్ ప్రకారం.. అభిజీత్ తన మద్దతుదారుల భుజాలపై ఎక్కి సభా ప్రాంగణంలోకి ఉత్సాహంగా వస్తున్నారు. అదే సమయంలో గుంపులో ఉన్న ఓ వ్యక్తి సడెన్‌గా ఆయన స్కార్ఫ్ (Scarf) పట్టుకుని కిందకు లాగే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే ఏకంగా నాలుగుసార్లు అభిజీత్ చెంపపై కొట్టాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది.
రెచ్చిపోయిన కార్యకర్తలు.. అడ్డుకున్న అభిజీత్
తమ నాయకుడిపై అందరి ముందే దాడి జరగడంతో సీజేపి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దాడి చేసిన వ్యక్తిని చుట్టుముట్టి చితకబాదే ప్రయత్నం చేశారు. ఈ కల్లోలం మధ్యలో అభిజీత్ స్వయంగా జోక్యం చేసుకుని, ఆ వ్యక్తిపై దాడి చేయొద్దంటూ కార్యకర్తలను శాంతింపజేయడం వీడియోలో స్పష్టంగా రికార్డయ్యింది. అయినా జనాల కోపం చల్లారకపోవడంతో నిరసన కార్యక్రమం కాసేపు రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అసలు ఎందుకు ఈ నిరసన?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET, CBSE, CUET, SSC లాంటి కీలక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీజేపీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యా వ్యవస్థలోని లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన తాము చేస్తున్నది శాంతియుతమైన రాజ్యాంగబద్ధ పోరాటమని సీజేపీ చెబుతోంది.
సోనమ్ వాంగ్‌చుక్ సపోర్ట్
ఈ ఉద్యమానికి ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యాక్టివిస్టులు ఈ క్యాంపెయిన్‌లో జాయిన్ అవుతున్నారు. ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) కూడా సీజేపీకి అండగా నిలిచారు. ఒకవేళ అభిజీత్‌ను అరెస్ట్ చేస్తే, తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్షకు (Fast) దిగుతానని ఆయన ప్రకటించడం ఈ నిరసనకు మరింత బలాన్నిచ్చింది.
పోలీసుల ఆంక్షలు.. ఢిల్లీకి షిఫ్ట్
ఆదివారం రాత్రే జైపూర్ చేరుకున్న అభిజీత్.. నిరసన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొదట పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించినా, ఆ తర్వాత షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. కేవలం 800 మంది మాత్రమే ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొనాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఇలాంటి నిరసన కార్యక్రమం నిర్వహించడానికి ఢిల్లీ పోలీసుల నుంచి తమకు పర్మిషన్ లభించిందని సీజేపీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. విద్యా రంగంలో జవాబుదారీతనం తీసుకురావడమే తమ లక్ష్యమని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది.
Abhijeet Dipke was slapped by some miscreants during a protest by the Cockroach Janta Party in Jaipur. pic.twitter.com/2gjKfutAVP
— Abhishek (@AbhishekSay) June 15, 2026
ఎక్స్‌లో స్పందించిన అభిజీత్
జైపూర్‌లో తనపై జరిగిన దాడి ఘటనపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే 'ఎక్స్' (X) వేదికగా స్పందిస్తూ.. "భౌతిక దాడులు భయానికి, పిరికితనానికి నిదర్శనం. మేము శాంతియుతంగా మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. నేను గాంధీ, అంబేద్కర్‌ల మార్గంలో నడిచేవాడిని, ఈ పోరాటాన్ని శాంతి, ప్రేమలతోనే కొనసాగిస్తాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాల్సిందే" అని ఆయన స్పష్టం చేశారు.
Physical attacks are a sign of fear and cowardice.
We will continue to raise our voices peacefully. I am a follower of Gandhi and Ambedkar, and I will keep fighting this battle with peace and love.
PS: Dharmendra Pradhan must resign!
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 15, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Abhijeet Dipke | అభిజీత్ దిప్కేపైకి ఇంకు చల్లిన మహిళ.. జంతర్ మంతర్ వద్ద గందరగోళం
జులై 18, 2026

Bihar Bridge Birthday Party | సేఫ్టీ లేదని రూ.26 కోట్ల బ్రిడ్జిని క్లోజ్ చేస్తే.. ఏకంగా డీజే, డ్యాన్సులతో బర్త్‌డే పార్టీ!
జులై 16, 2026

Tasmac Cooling Charge Scam | రూ.160 బీరుకు రూ.170.. సీఎం విజయ్‌కు యువకుడి ఫిర్యాదు.. VIDEO
జులై 15, 2026
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం



