Pawan Kalyan | కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టాం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము ఎన్నడూ అడ్డుపడలేదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టామని చెప్పారు. జాతీయ వాదాన్ని అర్థం చేసుకోవడానికే ఢిల్లీలో సమావేశం పెట్టినట్లు వెల్లడించారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము ఎన్నడూ అడ్డుపడలేదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టామని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ధోరణి మారలేదన్నారు. తెలంగాణలో జనసేన సభను అడ్డుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం జనసేన నాయకులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశం సందర్భంగా పవన్ పై విధంగా స్పందించారు. జాతీయ వాదాన్ని అర్థం చేసుకోవడానికే ఢిల్లీలో సమావేశం పెట్టినట్లు వెల్లడించారు.
2009 నుంచి చెబుతూనే ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎప్పుడూ అడ్డు చెప్పలే. కాంగ్రెస్ విభజన తీరు అసంతృప్తిని, అశాంతిని సృష్టించింది. ఈరోజుకు కూడా వారసత్వ సమస్యలు, ఆస్తుల పంపిణీ వంటివి అలానే ఉన్నాయి. తెలంగాణలో జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ మెడలు వంచుతాం, తడాఖా చూపిస్తామని చాలా మంది దక్షిణాది నాయకులు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు అని పవన్ వ్యాఖ్యనించారు.
140 కోట్ల మందిని కాపాడ్డానికి ఢిల్లీలోని అన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయి. ఢిల్లీ గాఢతను చూసిన తర్వాత మన నాయకులు దేశ సమగ్రతను అర్థం చేసుకుంటారు. ఇండియా గేట్‌కు వెళ్తే దేశ సైనికులు చేసిన త్యాగాలు అర్థమవుతాయి.
కాక్రోచ్‌పై సంచలన వ్యాఖ్యలు..
కాక్రోచ్ మాట వినగానే సుమతి శతకం గుర్తొచ్చింది. చిన్న క్రిమికీటకాలు కూడా బలవంతమైన పాములను చంపేస్తాయి. ఇలాంటి ఆలోచనలు చేసేవారు దేశ సమగ్రతను బలి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ ప్రవాహంలో మనం చిక్కుకోవద్దని చెప్పడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. విభజన వాదాన్ని సృష్టించే విషయంలో ప్రతిఒక్కరూ ఎదురొడ్డి పోరాడాలి అని పవన్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





