Rhiya Yadav | ముంబై యువతి తెగువ.. పోలీసు వాహనాన్ని అడ్డుకుని.. ఎవరీ రియా యాదవ్..?
Rhiya Yadav | నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలో నిర్వహించిన ఆందోళనల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రియా యాదవ్ (Rhiya Yadav) అనే యువతి నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డగించింది.
Rhiya Yadav | నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలను కొనసాగుతున్నాయి (CJP Protests). ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతోంది. ఈ నిరసనల సందర్భంగా మహారాష్ట్రలోని ముంబై (Mumbai)లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. నిరసన తెలుపుతున్న ఆందోళన కారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌ను (Police Van) ఓ యువతి ధైర్యంగా అడ్డుకుంది.
వ్యాన్ ముందు నిలబడి నిరసన తెలిపింది. వర్షంలోనూ హుడీ ధరించిన సదరు యువతి.. నడిరోడ్డుపై వ్యాన్ (Police Van) ముందుకు కదలకుండా అడ్డుకుంది. పోలీసులు తమ డ్యూటీని సక్రమంగి నిర్వర్తించడం లేదని సదరు యువతి ఆరోపించారు. దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ (Shivaji Park) ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె తెగువకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యువతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక యువతి చర్యకు పోలీసులు నిరసనకారులను వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.
ఇక పోలీసు వాహనాన్ని అడ్డుకున్న యువతిని రియా యాదవ్ (Rhiya Yadav)గా గుర్తించారు. ఆమెకు ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా గుర్తింపు ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. పలు మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించారు. చివరి సారిగా 'దిల్బరా' అనే వీడియో సాంగ్‌లో కనిపించారు. అంతేకాదు, 'రియాసత్' పేరుతో ఓ చేనేత వస్త్రాల బ్రాండ్‌నూ నిర్వహిస్తున్నారు.
Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏
One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.
Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡#संसद_मार्च pic.twitter.com/s3ZUTKzfig
— ER syed Amber Rizvi (@AmberRizvi302) July 22, 2026
Also Read..
యువతకు సంబంధించిన అంశం.. రాజకీయం చేయొద్దు : కిరణ్ రిజుజు
పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్ష ఎంపీల ఆందోళన.. పోటాపోటీ నినాదాలు
హైదరాబాద్ భవిష్యత్ ఊహించడమే కాదు.. కాంగ్రెస్ ఆచరణలో చూపిస్తుంది
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
సెప్టెంబర్ 9, 2026

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్
- ●Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్
- ●KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్
- ●Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదు..?
- ●Sampoornesh Babu | కెరీర్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకే తీసుకున్నా - ప్యారడైజ్‌పై సంపూర్ణేష్ బాబు కామెంట్స్
- ●Sushila Rani’s Surrender | చరమాంకానికి మావోల పోరు.. లొంగిపోయిన మరో కీలక నాయకురాలు

Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్

Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్

KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్

Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదు..?



