త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahua Moitra | బ‌హుశా మ‌న విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ రాయ‌డం రాదేమో.. టీఎంసీ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు

Mahua Moitra | విద్యార్థుల నిర‌స‌న‌ల వేళ టీఎంసీ ఎంపీ మ‌హువా మొయిత్రా (Mahua Moitra) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు (Dharmendra Pradhan) రాజీనామా లేఖ రాయ‌డం తెలియ‌దేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

D

National | Published On Jul 21, 2026, 4.02 pm IST

Mahua Moitra | బ‌హుశా మ‌న విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ రాయ‌డం రాదేమో.. టీఎంసీ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు
Advertisement

Mahua Moitra | నీట్ పేప‌ర్ లీక్ (NEET paper leaks) వ్య‌వ‌హారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాల‌ని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో తృణ‌మూల్ పార్టీ ఫైర్‌బ్రాండ్‌, ఎంపీ మ‌హువా మొయిత్రా (Mahua Moitra) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు రాజీనామా లేఖ రాయ‌డం తెలియ‌దేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"బహుశా విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ ఎలా రాయాలో తెలియదేమో. ఆరెస్సెస్ కేవలం మీకు క్షమాపణ పిటిషన్లు రాయడం మాత్రమే నేర్పిస్తుంది" అని మహువా మొయిత్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్లు వెల్లువెత్తున్న వేళ మ‌హువా వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం ఈపోస్టు వైర‌ల్ అవుతోంది.

కాగా, నీట్ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిన్న చేప‌ట్టిన చ‌లో పార్ల‌మెంట్ మార్చ్ ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అణ‌చివేశారు. లాఠీఛార్జ్ చేశారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. పోలీసుల తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేది పోయి లాఠీఛార్జ్ చేయించ‌డం ఏంట‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ అంశాన్ని పార్ల‌మెంట్ వేదిక‌గా చ‌ర్చించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read..

అప్పుడు జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్‌ను సాగ‌నంపారు.. ఇప్పుడు విద్యార్థుల‌ను అణ‌చివేస్తున్నారు.. కేంద్రంపై జైరాం ర‌మేష్ ఫైర్‌

మ‌రోసారి తెలంగాణ‌లో టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వారి కోసమే..!

ఆర్‌సీవోలు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి.. కనీసం ఆరు గురుకులాలను సందర్శించాలి

Advertisement
Advertisement