త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pavala Shyamala | విషం తాగి చ‌చ్చిపోతే మీకు మ‌న‌శ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | అయ్యా.. 50 ఏండ్లుగా క‌ష్ట‌ప‌డి న‌టిగా బ్రతికాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..? అని పావ‌లా శ్యామ‌ల( Pavala Shyamala ) బోరుమ‌న్నారు.

S

Movies | Published On Jul 28, 2026, 6.53 am IST

Pavala Shyamala | విషం తాగి చ‌చ్చిపోతే మీకు మ‌న‌శ్శాంతిగా ఉంటుందా..?
Advertisement

Pavala Shyamala | త్రినేత్ర‌.న్యూస్ : సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌ల‌( Pavala Shyamala ).. హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అల‌రించారు. గ‌త కొన్నేండ్ల నుంచి ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న‌ప్ప‌టికీ, సినిమా రంగంలోని ఏ ఒక్క‌రూ కూడా ఆమె గురించి ఆలోచించ‌లేదు. చివ‌ర‌కు అనారోగ్యానికి గురై ఆస్ప‌త్రి పాలైన కూడా ప‌రామ‌ర్శించిన పాపాన పోలేదు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పావ‌లా శ్యామ‌ల గ‌తేడాది జ‌న‌వ‌రి నెల‌లో ఓ వీడియో విడుద‌ల చేశారు. త‌న ఆర్థిక ప‌రిస్థితి బాగ‌లేద‌ని త‌న‌కు సాయం చేయండి అంటూ పావ‌ల శ్యామ‌ల ఆ వీడియోలో వేడుకున్నారు.

అయ్యా.. 50 ఏండ్లుగా క‌ష్ట‌ప‌డి న‌టిగా బ్రతికాను. ఈ మూడేండ్ల‌ నుంచి నా ప‌రిస్థితి ఎలా అయ్యిందో అంద‌రికీ తెలుసు. ఈ విష‌యం చాల ఇంట‌ర్వ్యుల‌లో కూడా చెప్పాను. కానీ ఎవ‌రు స్పందించ‌లేదు. ఎలాగో ఇంత‌వ‌ర‌కు వ‌చ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..? దాదాపు 300 సినిమాలు చేశాను. చిరంజీవితో ప్రభాస్‌తో.. మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద హీరోల అంద‌రితో చేసి.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. ట్రీట్‌మెంట్ చేయించుకోలేక అవస్థగా ఉన్నాను. న‌న్ను ఇలానే వ‌దిలేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తారా.. ద‌య‌చేసి త‌న‌కు సాయం చేయండి అంటూ శ్యామ‌ల త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

గ‌త కొంత‌కాలంగా గుండె స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న శ్యామ‌ల‌ను ఐదు రోజుల క్రితం ఉస్మానియా ఆస్ప‌త్రిలో చేర్పించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తీవ్ర‌మైన గుండెపోటుతో క‌న్నుమూసింది.

Advertisement
Advertisement