త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET 2026 | మ‌రోసారి తెలంగాణ‌లో టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వారి కోసమే..!

TG TET 2026 | తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి టెట్( TG TET 2026 ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ కేవ‌లం ఇన్ స‌ర్వీస్ ఉపాధ్యాయుల( In Service Teachers ) కోసం మాత్ర‌మే.

S

Telangana | Published On Jul 21, 2026, 3.38 pm IST

TG TET 2026 | మ‌రోసారి తెలంగాణ‌లో టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వారి కోసమే..!
Advertisement

TG TET 2026 | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి టెట్( TG TET 2026 ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ కేవ‌లం ఇన్ స‌ర్వీస్ ఉపాధ్యాయుల( In Service Teachers ) కోసం మాత్ర‌మే. సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం ప్ర‌భుత్వ టీచ‌ర్లు త‌మ స‌ర్వీసుల్లో కొన‌సాగేందుకు, ప‌దోన్న‌తులు పొందేందుకు టెట్ త‌ప్పనిస‌రిగా ఉత్తీర్ణ‌త సాధించాల్సిందే. లేనియెడ‌ల ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల‌కు స‌ర్వీసులో కొన‌సాగేందుకు, ప‌దోన్న‌తులు పొందేందుకు అవ‌కాశం లేదు.

అర్హులైన టీచ‌ర్లు జూలై 22 నుంచి 29 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 31 నుంచి హాల్ టికెట్ల‌ను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. సెప్టెంబ‌ర్ 7 నుంచి 11 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లు కూడా సీబీటీ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన టెట్ ఫ‌లితాల్లో రెండు పేప‌ర్లు క‌లిపి 50,544 మంది ఉత్తీర్ణ‌త సాధించిన విష‌యం తెలిసిందే. మొత్తంగా 43.94 శాతం మంది అర్హత సాధించారు. పేపర్‌-1లో 65.29 శాతం మంది, పేపర్‌-2 గణితం-సైన్స్‌ విభాగంలో 40.76 శాతం, సోషల్‌లో 25.79 శాతం మంది కనీస మార్కులు సాధించారు.

ఈ సారైనా 14 వేల మంది టీచ‌ర్లు పాస‌య్యేనా..?

ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న టీచర్లు త‌మ స‌ర్వీసుల్లో కొనసాగాలంటే... రెండేళ్లలో టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబరులో తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ప్రభుత్వ టీచర్లు, కేజీబీవీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 23,623 మంది పరీక్ష రాశారు. వారిలో 8,809 మంది(37.29 శాతం) పాసయ్యారు. గత టెట్‌లో 65,605 మంది టీచర్లు పరీక్ష రాయగా... 37,893 మంది(57.76 శాతం) పాసయ్యారు.

Advertisement
Advertisement