త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

South Central Railway | 16 గంట‌లు రైలు ఆల‌స్యం.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రూ. 25 వేల జ‌రిమానా

South Central Railway | ఓ రైలును ఇత‌ర మార్గంలో మ‌ళ్లించ‌డంతో ఓ వ్యాపారి త‌న‌కు జ‌రిగిన న‌ష్టంపై వినియోగ‌దారుల ఫోర‌మ్‌ను ఆశ్ర‌యించగా, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే(South Central Railway )కు మొట్టికాయ‌లు వేసింది. స‌ద‌రు ప్ర‌యాణికుడికి రూ. 25 వేల ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించింది.

S

Telangana | Published On Jul 28, 2026, 7.54 am IST

South Central Railway | 16 గంట‌లు రైలు ఆల‌స్యం.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రూ. 25 వేల జ‌రిమానా
Advertisement

South Central Railway | త్రినేత్ర‌.న్యూస్ : కొన్ని సంద‌ర్భాల్లో రైళ్ల మ‌ళ్లింపులు జ‌రుగుతుంటాయి. కానీ ప్ర‌యాణికుల‌కు స‌రైన స‌మాచారం ఉండ‌దు. దీంతో త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు అధిక స‌మ‌యం ప‌డుతుంది. ఇత‌ర‌త్రా ప‌నుల‌న్నింటికీ కూడా ఆటంకం ఏర్ప‌డ‌నుంది. అయితే ఓ రైలును ఇత‌ర మార్గంలో మ‌ళ్లించ‌డంతో త‌న‌కు జ‌రిగిన న‌ష్టంపై వినియోగ‌దారుల ఫోర‌మ్‌ను ఆశ్ర‌యించగా, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే(South Central Railway )కు మొట్టికాయ‌లు వేసింది. స‌ద‌రు ప్ర‌యాణికుడికి రూ. 25 వేల ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌కు చెందిన రామ‌కృష్ణ జీడిప‌ప్పు వ్యాపారి. అయితే 2024 సెప్టెంబ‌ర్ 30న ఢిల్లీలో ఓ బిజినెస్ మీటింగ్‌కు కావాల్సి ఉండే. ఈ క్ర‌మంలో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే త‌మిళ‌నాడు సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రీమియం త‌త్కాల్ కింద రూ. 1428 చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇక సెప్టెంబ‌ర్ 28న రైలు ఎక్కేందుకు చెన్నై చేరుకున్నాడు స‌ద‌రు వ్యాపారి. రైలు ఎక్కి కూర్చున్నాడు.. అంత‌లోనే రైలు మార్గాన్ని మ‌ళ్లించిన‌ట్లు తెలుసుకుని షాక‌య్యాడు. మొత్తంగా 16 గంట‌లు ఆల‌స్యంగా ఢిల్లీకి చేరుకున్నాడు. అంటే సెప్టెంబ‌ర్ 30న రాత్రి 10.30కు ఢిల్లీకి చేరుకున్నాడు వ్యాపార‌వేత్త‌. ఆయ‌న చేరుకునే లోపే బిజినెస్ మీటింగ్ ముగిసింది. దీంతో త‌న వ్యాపార ఒప్పందాన్ని కోల్పోయాడు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు తిరిగి రావాల్సి ఉండ‌గా, ఆ విమానం కూడా మిస్ అయింది. తీవ్రంగా న‌ష్ట‌పోయిన రామ‌కృష్ణ‌.. హైద‌రాబాద్ జిల్లా వినియోగ‌దారుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించాడు.

ఈ కేసులో విచార‌ణ‌లో చేప‌ట్టిన వినియోగ‌దారుల క‌మిష‌న్ -1 తీవ్రంగా స్పందించింది. బాధిత వ్యాపారికి రూ.25 వేల పరిహారంతోపాటు రూ.10 వేలు కేసు ఖర్చులుగా చెల్లించాలని కమిషన్‌ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, వి.జనార్దన్‌రెడ్డిలతో కూడిన బెంచ్‌ ఆదేశించింది.

సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ ఆధునికీక‌ర‌ణ ప‌నుల వ‌ల్లే

సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ పనులతో మార్గాన్ని మళ్లించాల్సి వచ్చిందని రైల్వే అధికారులు కమిషన్‌కు తెలిపారు. దారిలో విజయవాడ, ఖమ్మం, వరంగల్, నాగ్‌పూర్‌ స్టేషన్లలో ఎక్కే ప్రయాణికులకు మాత్రమే ఎస్‌ఎంఎస్‌ పంపామని, చెన్నైలో రైలు ఎక్కేవారికి పంపలేదని అంగీకరించారు. దీన్ని కమిషన్‌ తప్పు పట్టింది. ముందే సమాచారం ఇచ్చి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవారని పేర్కొంది. వ్యాపార నష్టానికి సరైన ఆధారాలు చూపనప్పటికీ, ప్రయాణికుడి మానసిక వేదన, విమానం అందుకోకపోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకొని సౌత్ సెంట్ర‌ల్ రైల్వేకు జ‌రిమానా విధించింది.

Advertisement
Advertisement