త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jairam Ramesh | అప్పుడు జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్‌ను సాగ‌నంపారు.. ఇప్పుడు విద్యార్థుల‌ను అణ‌చివేస్తున్నారు.. కేంద్రంపై జైరాం ర‌మేష్ ఫైర్‌

Jairam Ramesh | రైతుల కష్టాల గురించి పదేపదే మాట్లాడినందుకే ధ‌న్‌ఖ‌ర్‌తో మోదీ బ‌ల‌వంతంగా రాజీనామా చేయించార‌ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు. ఇప్పుడు పేపర్ లీకేజీలపై నిరసనలు చేస్తున్న యువత, విద్యార్థులను అణచివేస్తున్నారని విమ‌ర్శించారు.

D

National | Published On Jul 21, 2026, 3.32 pm IST

Jairam Ramesh | అప్పుడు జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్‌ను సాగ‌నంపారు.. ఇప్పుడు విద్యార్థుల‌ను అణ‌చివేస్తున్నారు.. కేంద్రంపై జైరాం ర‌మేష్ ఫైర్‌
Advertisement

Jairam Ramesh | జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ (Jagdeep Dhankhar) రాజీనామా చేసి నేటికి స‌రిగ్గా ఏడాది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల కష్టాల గురించి పదేపదే మాట్లాడినందుకే ధ‌న్‌ఖ‌ర్‌తో మోదీ బ‌ల‌వంతంగా రాజీనామా చేయించార‌ని ఆరోపించారు. ఇప్పుడు పేపర్ లీకేజీలపై నిరసనలు చేస్తున్న యువత, విద్యార్థులను అణచివేస్తున్నారని విమ‌ర్శించారు.

"స‌రిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు.. అప్ప‌టి భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ అనూహ్యంగా రాజీనామా చేశారు. మ‌రో రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉన్న‌ట్లుగానే ప‌ద‌వి నుంచి దిగిపోయారు. ఆయ‌న్ని ప్ర‌ధాని మోదీ ఎంతో ఘ‌నంగా ఆ ప‌ద‌విలో కూర్చోబెట్టారు. అయితే, రైతుల క‌ష్టాలు, వారి ద‌య‌నీయ స్థితిపై ప‌దేప‌దే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ వారి ప‌ట్ల మోదీ ప్ర‌భుత్వం ఉదాసీనంగా వ్య‌వ‌హరిర‌స్తోంద‌ని జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ అల‌సత్వంపై ప‌దే ప‌దే ప్ర‌శ్నించినందుకే ఆయ‌న్ని సాగ‌నంపారు. అలాంటి అల‌స‌త్వం, ఉదాసీన‌తే ఇప్పుడు ల‌క్ష‌లాది మంది విద్యార్థులు, యువ‌త ఎదుర్కొంటున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యల విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది" అని జైరాం ర‌మేష్ వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

కాగా, ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గ‌తేడాది జులై 21న రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనారోగ్య కార‌ణాల‌తో రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2022 ఆగస్టు 11లో ఈ ప‌ద‌వి చేప‌ట్టిన ఆయ‌న‌ మ‌రో రెండేళ్ల ప‌ద‌వీకాలం ఉండ‌గానే ఈ అనూహ్యం నిర్ణ‌యం తీసుకోవ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ధన్‌ఖడ్‌ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. రాజీనామా త‌ర్వాత కొంత‌కాలం ఆయ‌న బాహ్య ప్ర‌పంచానికి క‌నిపించ‌లేదు. ఆ త‌ర్వాత ఉపరాష్ట్రపతి (Vice President)గా సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read..

హైద‌రాబాద్‌లో సాయంత్రం వ‌ర్షాలు.. త్వ‌ర‌గా లాగ్ అవుట్ అవ్వండి..

గండిపేట‌లో.. వ‌ర్షాల కోసం 108 సార్లు వ‌రుణ జ‌ప మంత్రాలు..

విద్యార్థుల‌కు ప్ర‌ధాని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి : రాహుల్ గాంధీ

Advertisement
Advertisement