Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
Uniforms | పశ్చిమ బెంగాల్‌లో డెంగీ, ఇతర దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దోమకాటును తగ్గించేందుకు పాఠశాలల్లో విద్యార్థుల దుస్తులపై తాత్కాలిక మార్పులు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ సూచించారు.
- తాత్కాలికంగా యూనిఫామ్ మార్పులకు బెంగాల్ మంత్రి ఆదేశం
Uniforms | పశ్చిమ బెంగాల్‌లో డెంగీ, ఇతర దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దోమకాటును తగ్గించేందుకు పాఠశాలల్లో విద్యార్థుల దుస్తులపై తాత్కాలిక మార్పులు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ సూచించారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో సాధారణ యూనిఫామ్‌తో సంబంధం లేకుండా విద్యార్థులు పూర్తి చేతుల చొక్కాలు, పూర్తి పొడవు ప్యాంట్లు ధరించేలా అనుమతించాలని మంత్రి పాఠశాలలను కోరారు. అమ్మాయిల యూనిఫామ్‌లో స్కర్ట్ ఉంటే.. ఈ మూడు నెలలు కాళ్లు పూర్తిగా కప్పే సల్వార్ సూట్లు ధరించేలా అనుమతించాలని సూచించారు.
లాంగ్ సాక్స్‌తో రక్షణ ఉండదు
స్కర్ట్‌లకు ప్రత్యామ్నాయంగా మోకాళ్ల వరకు ఉండే సాక్స్ వాడొచ్చన్న సూచనను మంత్రి తోసిపుచ్చారు. అవి పలుచగా ఉండటంతో దోమలు కుట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల అబ్బాయిలు పూర్తి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంట్లు.. అమ్మాయిలు కాళ్లు కప్పే సల్వార్ సూట్లు ధరించడం ద్వారా దోమకాటును తగ్గించవచ్చని పేర్కొన్నారు. తాత్కాలిక డ్రెస్‌కోడ్‌పై ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో అధికారిక మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ప్రైవేటు పాఠశాలలు కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, యూనిఫామ్‌లో మార్పులపై తుది నిర్ణయం ఆయా పాఠశాలలదే.
మూడు నెలలు ప్రయోగాత్మకంగా చూద్దామన్న మంత్రి
వర్షాకాలం అనంతరం దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరిగే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. డ్రెస్‌కోడ్ మార్పుతోపాటు అవగాహన కార్యక్రమాలు, దోమల నియంత్రణ చర్యలు కూడా కొనసాగుతాయని చెప్పారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వైద్య చికిత్సను ఆలస్యం చేయవద్దని సూచించారు. ముందుగానే చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. ‘సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మూడు నెలలు అన్ని పాఠశాలలు ఈ విధానాన్ని పాటించి చూద్దాం. డెంగీ కేసులను తగ్గించగలమో పరిశీలిద్దాం’ అని మంత్రి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..
- ●AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..
- ●Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే 22ఏ జాబితా
- ●Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
- ●World Map | మారనున్న ప్రపంచ పటం!
- ●KTR Karimnagar Speech | ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్

IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..

AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..

Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే 22ఏ జాబితా

Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం





