త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | భ‌య‌ప‌డుకుంటూ రాకండి.. నేన్ ఇక్క‌డే ఉన్నా.. ద‌గ్గ‌రుండి మీకు అన్నీ చూపిస్తా

Harish Rao | కాంగ్రెస్ వాళ్లు సిద్దిపేటకు వ‌చ్చి నా భూములు చూసి వెళ్తార‌టని మాజీ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. వంద‌ల మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు పెట్టుకొని భ‌య‌ప‌డుకుంటూ రావాల్సిన ప‌ని లేద‌న్నారు.

S

Telangana | Published On Sep 18, 2026, 2.47 pm IST

Harish Rao | భ‌య‌ప‌డుకుంటూ రాకండి.. నేన్ ఇక్క‌డే ఉన్నా.. ద‌గ్గ‌రుండి మీకు అన్నీ చూపిస్తా
Advertisement
  • మా సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆప్యాయ‌త‌ల‌కు ప్ర‌తిరూపం
  • క‌డుపునిండా అన్నం పెట్టి పంపిస్తాం
  • సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ వాళ్లు సిద్దిపేటకు వ‌చ్చి నా భూములు చూసి వెళ్తార‌టని మాజీ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. వంద‌ల మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు పెట్టుకొని భ‌య‌ప‌డుకుంటూ రావాల్సిన ప‌ని లేద‌న్నారు. తాను ఇక్క‌డే ఉన్నాన‌ని.. ద‌గ్గ‌రుండి అన్నీ చూపిస్తాన‌ని వ్యాఖ్యానించారు. మా సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆప్యాయతకు, ఆతిథ్యానికి చిరునామా అని పేర్కొన్నారు. సిద్దిపేటకు ఎవరు వచ్చినా కడుపునిండా అన్నం పెట్టి ప్రేమగా మాట్లాడుతామ‌ని వివ‌రించారు. ఈమేర‌కు శుక్ర‌వారం సిద్దిపేట‌లో ఆయ‌న మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.

కాకుంటే ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పండి..

కాంగ్రెస్ వాళ్లు సిద్దిపేటకు వస్తున్నరట. నా భూములు చూసి పోతరట. వందల మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు, రోప్ పార్టీలు.. ఎందుకు అంత? డ్రోన్లు పెట్టి ఫోటోలు తీయడం ఎందుకు.. నేను ఇక్కడే ఉన్నా. నాకు చెబితే అన్ని ఏర్పాటు చేస్తా. మంచిగ కడుపు నిండ అన్నం తినిపించి దగ్గరుండి కంటి నిండా తోట అన్నీ చూపిస్తా. కాకుంటే ఉన్నది ఉన్నట్లు చెప్పండి. అబద్ధాలు చెప్పకండి. నా జీవితం తెరిచిన పుస్తకం.

నేన్ దాచిందేంది.. నువ్వు కొత్త‌గా బ‌య‌ట‌పెట్టేదేంది?

అన్ని ఎన్నికల అఫిడవిట్లలో నా భూములు, ఆస్తుల వివరాలు సుస్పష్టంగా చెప్పిన. సర్వే నెంబర్లతో సహా భూముల వివరాలు ఇచ్చినం. రామంచల 13 ఎకరాలు ఉంటే లేనిపోనీవి చెప్పుతున్నారు. నేను దాచింది ఏముంది? నువ్వు కొత్తగా బయట పెట్టేది ఏముంది? మీలాగా నేను కబ్జాలు పెట్టలేదు, ప్రజల సొమ్ము దోచుకోలేదు.

సిద్దిపేట ప్రజలు నా పని చూసి ఏడుసార్లు గెలిపించారు. నన్ను దీవించారు. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మా సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆప్యాయతకు, ఆతిథ్యానికి చిరునామా. అంతమంది పోలీసుల‌ను పెట్టుకొని భయపడుకుంటూ రావాల్సిన అవసరం మీకు లేదు అని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement