Kishan Reddy | తెలంగాణకు 2 లక్షల ఇళ్లు.. పీఎంఏవై–జీ కింద కేంద్రం ఆమోదం: కిషన్‌రెడ్డి
Kishan Reddy | తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై–జీ) కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 2 లక్షల ఇళ్ల లక్ష్యాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదించిందని వెల్లడించారు.
Kishan Reddy | తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై–జీ) కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 2 లక్షల ఇళ్ల లక్ష్యాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదించిందని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించుకునే అవకాశం లభించనుందని పేర్కొన్నారు.
తెలంగాణలో పీఎంఏవై–జీ అమలుకు గతంలో అవరోధాలు ఏర్పడ్డాయని కిషన్‌రెడ్డి తెలిపారు. 2018లో నిర్వహించిన ఆవాస్ సర్వేలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పాల్గొనకపోవడంతో రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం కాలేదని పేర్కొన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో పథకం అమలవుతున్నప్పటికీ తెలంగాణకు ఇళ్ల మంజూరు జరగలేదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2024 ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పీఎంఏవై–జీ కింద ఇళ్ల మంజూరుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా తెలంగాణకు 2 లక్షల ఇళ్ల లక్ష్యాన్ని ఆమోదించిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు మంజూరైన 2 లక్షల ఇళ్లతో గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పీఎంఏవై–జీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందుతుంది. తాజాగా రాష్ట్రానికి ఇళ్ల లక్ష్యం ఖరారు కావడంతో లబ్ధిదారుల గుర్తింపు, ఇళ్ల మంజూరు, నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TG Assembly | ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం
సెప్టెంబర్ 18, 2026

TGPSC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!
సెప్టెంబర్ 18, 2026

John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్‌వెస్లీ డిమాండ్..
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●TG Assembly | ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం
- ●TGPSC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!
- ●John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్‌వెస్లీ డిమాండ్..
- ●Madhu Yaskhi | జీవో 118 బాధితులకు శాశ్వత పరిష్కారం.. మంత్రులతో మధుయాష్కి భేటీ
- ●TG Assembly | ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 8 రోజులు.. 51 గంటల 52 నిమిషాలు నడిచిన సభ
- ●Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ - పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ - ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?

TG Assembly | ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం

TGPSC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!

John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్‌వెస్లీ డిమాండ్..

Madhu Yaskhi | జీవో 118 బాధితులకు శాశ్వత పరిష్కారం.. మంత్రులతో మధుయాష్కి భేటీ



